రమణాశ్రమ లేఖలు 52 అణోరణీయాన్, మహతోమహీయాన్ 22-7-1946
రమణాశ్రమ లేఖలు 52 అణోరణీయాన్, మహతోమహీయాన్ 22-7-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/52-22-7-1946.html
ఈ ఉదయం పదిన్నర గంటలకు పట్నం నుండి శొంఠి రామమూర్తి గారు, వారి భార్య, సోదరుడు, మరికొందరు స్నేహితులతో వచ్చారిక్కడికి. వారు వచ్చేసరికి ఒక భక్తుడు ఏదో గ్రంధం చదువుతూ భగవంతుల నిట్లా ప్రశ్నించాడు. "ఈ పుస్తకంలో 'అన్నము మనము తింటాము. అన్నము మనలను తింటుంది' అని వ్రాశారే, అదెట్లా? మనము అన్నము తింటాము సరే, అన్నము మనలను తింటుందంటే ఏమిటి?" అని అడగటం, భగవాన్ మౌనం వహించటం జరుగుతున్నది. రామమూర్తిగారిదంతా గమనిస్తూ కూర్చున్నారు.
https://www.facebook.com/359807631501891/posts/487199492096037/?app=fbl
పది నిమిషాలు పలకకుండా వుండి తమ సోదరుడు భగద్దర్శనాభిలాషికావటమే తమ ఈ రాకకు కారణమనీ, పదేళ్ళ క్రిందట ఒకసారి దర్శించితిననీ చెప్పి అంతకుముందే అక్కడి భక్తులడిగిన ప్రశ్నను పురస్కరించుకొని ఇట్లా మనవి చేశారు రామమూర్తిగారు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
"అన్నమువల్లనే (భోగ్యపదార్థముల సహాయమువల్లనే) సర్వభూతములను ఉత్పత్తి స్థితిలయాదుల నందుచుండుట వలన అన్నమే బ్రహ్మమంటారు. ఆ బ్రహ్మమే అంతటా ఆవరించి వుంటుంది. అన్ని వస్తువులు దాని ప్రతిబింబం కావటం వల్ల, అన్నమని దానికే అనగా ఆ బ్రహ్మమునకే పేరు గాబట్టి ఆ అన్నం మనలను తింటుంది అని గదా అర్థం. ఇప్పుడు వీరడిగిన ప్రశ్న కిదే గదా జవాబు" అని వారంటే "ఆవు" నన్నారు భగవాన్.
ఇంకా వారు సైన్సును బట్టి ఇంగ్లీషులోనే మాట్లాడారు. వారి తమ్ముడున్నూ కొంచెం సేపు ఆటం బాంబును గురించీ, ఇంకా ఏమేమో సైన్సు, సైన్సంటూ ఇంగ్లీషులోనే మాట్లాడారు. నాకేమో, ఇంగ్లీషు రాదాయె. భగవాన్ మాత్రం తెలుగులోనే ప్రత్యుత్తరం చెప్పటం వల్ల తెలిసినదేదో వ్రాస్తున్నాను. సైన్సు ప్రకారం వారు చెప్పినదంతా వినివిని "అవునండీ, ఇదేదైనా తన్ను విడిచి లేదుగదా? తానున్న వెనుక అన్నీ వున్నవి. తాను లేనని ఎవరూ చెప్పరు. దేవుడు లేడనే నాస్తికుడైనా తానున్నానని ఒప్పుకుంటాడు. అందువల్ల ఏది వచ్చినా తనలోనుంచే రావాలి. తనలోనే అణగాలి. ఏదైనా తనకు భిన్నంగా లేదు. 'అణోరణీయాన్, మహతోమహీయాన్' అన్న శృతి వాక్యాన్ననుసరించి మహత్తుకు మహత్తుగా వుండేది అదే. అణువులో అణువుగా ఉండేదీ అదే నన్నారు భగవాన్. "ఈ అణువుకు, మహత్తుకు భేదం దేన్ననుసరించి వస్తుంద" దని ప్రశ్నించారు మూర్తిగారు. "దేహాన్ననుసరించే వస్తుం"దన్నారు భగవాన్. "మరి లోకంలో ఇన్ని రకాల శక్తులు గోచరిస్తయే. ఒకదాని ననుసరించి మరొకటిగా, అదేమీ?" అన్నారు వారు. "మనస్సేనండీ కారణం. ఆ మనస్సు ఇన్ని రకాల తోస్తుంది. అది పుట్టగానే అన్నీ పుడతవి. పంచభూతాలో, భూతాల కవతల వుండే శక్తులో, ఏవైనా సరే. ఆ మనస్సు పుడితే సరి, అన్నీ పుడతవి, అది అణిగితే అన్నీ అణుగుతవి. అన్నిటికీ అదే కారణం" అన్నారు భగవాన్.
T.me/BhagavanRaman
Comments
Post a Comment