రమణాశ్రమ లేఖలు 50 సర్వం అంటే యేమిటి? 5-7-1946

రమణాశ్రమ లేఖలు 50 సర్వం అంటే యేమిటి? 5-7-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/50-5-7-1946.html
    నేటికి మూడు రోజుల నుంచీ కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవానులను ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా వున్నాడు. శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే వున్నారు. ఈ ఉదయం 9 గంటలకు మళ్ళీ మొదలు పెట్టాడా యువకుడు. "సర్వం తానే అంటారే, ఆ సర్వం తానుగా భావించడం ఎట్లా?" అని ప్రశ్నించే సరికి భగవాన్ ఇంచుక రూక్ష స్వరంతో "సర్వం అంటే యేమిటి? నీ వెవరు? నీ వెవరో ముందు చెపితే సర్వం సంగతి ఆలోచిద్దాం. ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ళనుంచి అడుగుతున్నావుగాని, నీవెవరవు అన్న నా ప్రశ్న కింతవరకు జవాబివ్వవే? నీవెవరో ముందు చెప్పి ఆ వెనుక సర్వాన్ని గురించి ప్రశ్నించు, నే జవాబిస్తాను. నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు. అసలు నీ వెవరో తెలుసుకోడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు. ఆ ప్రయత్నం విడచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ వుంటే అంతులేని ప్రవాహం లాగ పోతూనే ఉంటుంది. దీనికి ఎల్ల లేదు. తన్ను విచారించి తెలుసుకుంటేనే శాంతి వుంది గాని, తన్ను విడిచి, వారెట్లా వున్నారు వీరెట్లా వున్నారు అని విచారిస్తూ ప్రశ్నిస్తే ఏమి లాభం? ఇదంతా వృధా ప్రయాస" అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/488382735311046/?app=fbl
    "తన్ను తెలుసుకోడానికి గురువు, సాధన వద్దా?" అన్నాడా యువకుడు. "నీకు గురువెందుకు? సాధనెందుకు? నీకే అన్నీ తలుసునంటావే, ఇక గురువెందుకు? చెప్పింది వినవు. గురువేం జేస్తాడు? చెప్పిన త్రోవన పోతే గదా గురు సహాయం? సాధన అంటావు. దేనికి సాధన? ఏ సాధన? ఎన్ని ప్రశ్నలు? ఏదో ఒక త్రోవన పోవాలిగాని, ప్రశ్నపరంపరలతో ఉరుకులు పెడితే లాభం ఏమున్నది? నీవు తింటే కడుపు నిండుతుందా? వేరొకరు తింటే నిండుతుందా? వారెట్లా, వీరెట్లా, అదెట్లా, ఇదెట్లా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి? మెదలకుండా తన స్థితిలో తానున్న ట్లుంటుందా ఈ ప్రసంగ సుఖం? తన్ను విడిచేదీ, ఏది సుఖం! ఏది సుఖం! అంటూ ఆకాశం భూమి అంతా వెదికేది. ఈ తిరిగే, ఆ అడిగే, నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి. ఇట్లా తన్ను తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
    ఇంతలో మరొక రందుకొని, "జీవుడికి కర్మ ఎట్లా వచ్చింది?" అన్నారు. "అసలు జీవుడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎట్లా వచ్చిందో వెనుక చూచుకుందాం. జీవుడంటే ఏమిటో తెలియదు. ఆ జీవుడికి కర్మ ఎట్లా వచ్చింది? ఆ కర్మ జీవుడికి అంటి ఉందా? దూరంగా ఉందా? ఇవి ఆలోచనలు. ఈ బయటికి విజ్రుంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ వుండవు" అన్నారు భగవాన్.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ