రమణాశ్రమ లేఖలు 49 సమాధి అంటే యేమి? 9-6-1946

రమణాశ్రమ లేఖలు 49 సమాధి అంటే యేమి? 9-6-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/49-9-6-1946.html
    ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్టిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా ప్రొద్దు గడిపారు. విసుగు విరామం లేకుండా మాట్లాడటం చూచి, కొత్తగా వచ్చిన పాందు లొకరు లేచి, "భగవాన్! తామెప్పుడు సమాధిలోకి వెడతారు?" అని ప్రశ్నించారు. భక్తులంతా పక్కున నవ్వారు. భగవంతులకు కూడా నవ్వు వచ్చింది. రవంత తాళి, "ఓహో, అదా నీ సందేహం, సరే చెపుతాగాని అసలు సమాధి అంటే యేమి? ఎక్కడికి పోవాలి? కొండమీదకా? గుహలోకా? ఆకాశం మీదికా? సమాధి అంటే ఎట్లా వుండాలి? ఏమిటి? చెప్పు" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/488938595255460/?app=fbl
    పాపమతడేమీ చెప్పలేక చతికిల బడి కొంతసేపు పలకకుండా ఉండి "ఇంద్రియ సంచలన మణగితేగాని సమాధి కాదంటారే, ఆ సమాధిలోకి తామెప్పుడు దయచేస్తారని అడిగా" నన్నాడు. "ఆ, అదీ సమాచారం. ఏమిరా, యీ స్వామీ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడే. ఈయన యేమి జ్ఞాని? అని వారి ఉద్దేశ్యం. పద్మాసనం వేసుకొని, చేతులు కట్టుకొని ఊపిరి బిగబట్టి కూర్చుంటే గాని సమాధి కాదు. ఒక గుహ కూడా ఉండాలి. నిత్యం దానిలోకి పోతూ, వస్తూ వుండాలి. అప్పుడు 'ఈ స్వామీ బలే దొడ్డవాడురా!' అంటారు. నేనో ఈ భక్తులు, యీ కార్యక్రమం అంతా పెట్టుకొని ఎప్పుడూ మాట్లాడుతూ వుంటే, ఇదేమి స్వామిరా? అని వారి సందేహం. పాపం, ఏం జేసేది నేను? పూర్వం కూడా అట్లాగే జరిగిందొకటి రెండుసార్లు. నేను గురుమూర్తంలో వుండగా చూచిన వారొక రిద్దరు స్కందాశ్రమం వచ్చి, అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండటం చూచి చాలా దుఖించటం కూడా కద్దు. అయ్యో యీ స్వామి చెడిపోతున్నాడే, అని వారి తలంపు. మనమేం చేస్తాం? అప్పుడట్లా ఉండవలసి వచ్చింది. ఇప్పుడిట్లా ఉండవలసి వచ్చింది. ఏ కాలానికి ఎట్లా నడవాలో అట్లా నడుస్తుంది. కాని, వీరి దృష్టికి అన్నం తినకుండాను, మాట్లాడకుండాను వుంటే చాలు, స్వామిత్వం వచ్చేస్తుంది. లోకం ఇదే భ్రమలో పడతారు" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ