రమణాశ్రమ లేఖలు 47 ఏది బండి 8-5-1946

రమణాశ్రమ లేఖలు 47 ఏది బండి 28-5-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/47-28-5-1946.html
   ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ, విద్య, ఆడిఅన్నామలై కోవెల, దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాము. ఎండాకాలం, పది పన్నెండేండ్ల పిల్లలు, నడవలేరని బండి మాట్లాడాను. బండి చూచేసరికి ఆ యీడువాళ్ళు ఇంకా చిన్నవాళ్ళూ కొంతమంది బయలుదేరారు. గిరికి ప్రదక్షిణంగా పయనమై, అన్నీ చూపి, మధ్యాహ్నం పదకొండున్నరకు తిరిగి వచ్చాం. మూడింటికి హాలుకు వచ్చి మేము నమస్కరించుటే తడవుగా, "ఎన్ని గంటలకు వచ్చారు?" అని భగవాన్ నన్ను అడిగారు. పదకొండున్నర అయిందంటే, "వీరంతా నడవగలిగారా?" అన్నారు భగవాన్, బండీ ఎక్కి వెళ్ళామని విన్నవించాను.
https://www.facebook.com/359807631501891/posts/490079948474658/?app=fbl
    భగవాన్ పరిహాసంతో "ఓహో, సరిసరి బండీ నెక్కి పోతిరా? పుణ్యమెవరికి? బండికా, ఎద్దుకా? వీరికా?" అన్నారు. బదులు చెప్పలేక మౌనం వహించాను. ప్రక్కనున్న వారిని చూచి భగవాన్ " ఈ శరీరమే ఒక బండి. దీనికింకొక బండి. ఆ బండిని లాగుట కొక ఎద్దు. ఈ విధంగా జరిగిన పనికి మేము చేశామంటారు. అన్నీ ఇదేవిధంగా ఉంటవి. మద్రాసు నుంచి రైలులో వస్తారు. మేం వచ్చామంటారు. ఇట్లాగే శరీరమున్నూ. తనకి శరీర మొక బండి గదా. దీన్ని ఆశ్రయించిన కాలు నడుస్తుంది. నేను నడిచాను, నేను వచ్చాను, అని చెపుతారు. తానెక్కడికి పోయేది? ఇవన్నీ తనయందారోపించుకోటమే తప్ప, తానేదీ చేయడు" అని చెప్పి, వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా?" అని ప్రశ్నించారు. గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు గాని ఆ వెనుక ఎండ తీవ్రత వల్ల నడవలేక పోయారని విన్నవించాను. "పోనీ, అంతవరకైనా నడిచారు గదా?" అని ఆ ప్రసంగం విరమించారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
    విద్య చిలిపి పిల్ల గదూ? వచ్చింది మొదలు భగవానులను గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది. భగవాన్ తాతయ్య ఎక్కడికీ రారా? ఎందువల్ల? అనే ప్రశ్నలకు ఏం జెప్పినా సమాధానపడక 24 వ తేదీ ఉదయం ఎక్కడికీ ఎందుకు రారని శ్రీవారినే అడిగింది. చిన్నపిల్లల మాటలంటే వారి కమిత ప్రీతి గదా? సాధారణంగా దాన్ని చూచి "ఏమమ్మా, నన్ను మీవూరు తీసుకుపోతావా? అదేగదా నీ అభిప్రాయం. బాగుంది గాని నేను కదిలితే వీరంతా వస్తారు సరిగదా త్రోవలో ఎందరో పిలుస్తారు. వెళ్ళకపోతే ఊరుకుంటారా? పట్టుకపోతారు. అక్కడినుండి ఇంకా కొంత మంది బయలుదేరుతారు. వీళ్ళందరినీ తీసుకుపోగలవా? వీరే గాదు. నేను కదిలితే అరుణాచలానికి అరుణాచలమే బయలుదేరుతుంది. ఎట్లా తీసుకుపోగలవు? నన్ను చూడు, ఈ జైలులో పెట్టారు. ఒకవేళ నీవు తీసుకుపోయినా, మళ్ళీ త్రోవలోనే పట్టుకవచ్చి ఎవరో ఏదో జైలులో పడేస్తారు. ఏం జేసేదమ్మా, ఎట్లా రాను చెప్పు? వీళ్ళందరూ నన్ను వదులుతారా? ఏం? ఏమంటావు" అన్నారు భగవాన్. విద్య జవాబు చెప్పలేకపోయింది. అప్పటి నుంచీ "ఈ బిడ్డ నన్ను తమ వూరు రమ్మని పిలుస్తున్న" దని అందరితో చెప్పేవారు భగవాన్.

    నిన్న పిల్లలిద్దరూ వూరికి వెడతారని విని తొమ్మిది ముప్పావుకు భగవాన్ బయటకి వెడుతూ వాకిలిపక్కనే నిలుచున్న విద్యను చూచి, చెయ్యి పట్టుకొని "ఏమమ్మా, నన్ను కూడా తీసుకుపోతావా? గట్టిగా బండిలో వేసి తీసుకొనిపో" అన్నారు. వెళ్ళేముందు శ్రీవారి ఫోటోలు తీసుకొనివెళ్ళి చూపింది విద్య. ఫోటోలు చూడగానే "ఓహో, నన్ను తీసుకుపోతున్నావే? బాగా కట్టి పడెయ్యమ్మా బండిలో" అన్నారు భగవాన్. అందరూ ఆనందపరవశులై నవ్వారు. "భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే" అంటూ ఒకటే గంతులు విద్య.

    ఎవరు? ఎక్కడికి వెళ్ళేది? జైలేది? కొండలే కదులుతే వానిని ఆపే దెట్లా? అన్నీ సమస్యలే!
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ