రమణాశ్రమ లేఖలు 46 సంఘ నీతులు 11-5-1946
రమణాశ్రమ లేఖలు 46 సంఘ నీతులు 11-5-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/46-11-5-1946.html
నిన్న ఉదయం తొమ్మిది ముప్పావుకు బయటకి వెళ్ళిన భగవాన్ తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన మరొక కుక్కపైన అధికార స్వరంతో అరుస్తూ, దాన్ని తరమాలని హాలు ముందర గంతులు పెడుతూ ఉన్నది. అక్కడ ఉన్నవారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూచి నవ్వుతూ " ఎక్కడా మొదట వచ్చినవారంతా వెనుక వచ్చిన వారిపైన అధికారం చేయటం మామూలేగదా? ఇదీ అట్లాగే తన హక్కు స్థిరపరచుకొనే నిమిత్తం దానిమీద అధికారం చేస్తున్నది" అని చెప్పి ఆ పాత కుక్కను చూచి "ఎందుకురా అరుస్తావు? పోపో" మ్మన్నారు. వారి మాటలు అర్థమైనట్లే అది తొలగిపోయింది.
https://www.facebook.com/359807631501891/posts/490663205082999/?app=fbl
ఈ ఉదయం పది గంటలకు డాక్టర్ అనంతనారాయణ రావు భార్య రమాబాయి తమ తోటలోని మామిడిపండ్లు మంచిరకమని తెచ్చి యిచ్చి "కోతులు అన్నీఎత్తుకుపోతున్నవి. ఇవి మాత్రమే మిగలటంచేత త్వరపడి కోసి తెచ్చాను" అన్నది. భగవాన్ చిరునవ్వుతో "ఓహో, అట్లాగా, ఈ కోతులు అక్కడికిన్నీ వస్తున్నవా?" అని రవంత ఆశ్చర్యం అభినయించి, అందరివంకా చూచి "అవును. కోతులైతే ఒక్కొక్కటే ఎత్తుకుపోతవి. మనుష్యులైతే అన్నీ ఒక్కసారే గ్రహిస్తారు. అదేమీ అంటే, మా హక్కంటారు. కోతులది చిన్న దొంగతనమైతే వీరిది పెద్ద దొంగతనం. ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు. వీరిది మహాన్యాయమైనట్లు" అన్నారు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
T.me/BhagavanRaman
Comments
Post a Comment