రమణాశ్రమ లేఖలు 45 పరాత్పర రూపం 2-5-1946

రమణాశ్రమ లేఖలు 45 పరాత్పర రూపం 2-5-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/45-2-5-1946.html
         ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో సహా వచ్చి భగవత్సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్ళారు. వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి "స్వామీ, మేము రామేశ్వరాది యాత్రలు చేసుకొని, అక్కడ ఉండే దేవతలని సేవించి వచ్చాం. పరాత్పర స్వరూపం ఎటువంటిదో తమవల్ల తెలుసుకోవాలని ఉంది. దయవుంచి తెలుపగోర ప్రార్థిస్తున్నాను" అన్నాడు.
https://www.facebook.com/359807631501891/posts/491262415023078/?app=fbl
భగవాన్ చిరునవ్వుతో "అలాగా అదే, అదే మీరు చెపుతున్నారు కదా, అన్ని దేవతలను సేవించి వచ్చామని. అన్నీ తానైనప్పటికీ, ఈ అన్నిటికీ అతీతంగా ఉండేదేదో అదే పరాత్పర రూపం. అన్నిటికీ అతీతమన్నమాట. మీరా దేవాలయాలన్నీ చూడటంవల్ల ఇన్ని దేవుళ్ళకు మూలమైన పరాత్పర స్వరూపం ఎటువంటిదో అనే యోచన తట్టింది. ఇవన్నీ చూడకుంటే ఈ ప్రశ్న వస్తుందా?" అన్నారు. అప్పుడు శ్రీవారి ముఖ వికాసం చూస్తే పరాత్పర రూపం తాండవమాడుతూ ఉన్నదన్నమాట. ఆ కళ్లల్లోని తేజస్సు, ఆ మందహాసం చూచి తీరాలి. ఆ యువకుడికి ఆ మాటలు ఆర్థంగాకపోయినా శ్రీవారి కృపా వీక్షణంతోటే సంతృప్తి చెంది, సహచరులతో సహా నమస్కరించి వెళ్ళిపోయాడు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
వారటు పోగానే భగవాన్, ఉత్సాహపూరితులై సమీపవర్తియగు-ఒక భక్తునితో ఇదుగో చూడు. వారి మాటల్లోనే యధార్థం తెలుస్తుంది. పరాత్పర రూపం అంటే పరమునకు పరమైనదేదో అదే యథార్థమని దానికర్థం అడిగే మాటకే అర్థం తెలియదు. అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలోనే ఉంటుంది" అన్నారు.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ