రమణాశ్రమ లేఖలు 43 ఉన్న వస్తువు ఒక్కటే 23-4-1946

రమణాశ్రమ లేఖలు 43 ఉన్న వస్తువు ఒక్కటే 23-4-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/43-23-4-1946.html
   ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాను యువకుడు ఇద్దరు ముగ్గురు సహచరులతో వచ్చాడిక్కడికి. ఆ కూర్చున్న వాలకం చూస్తే ఏదో ప్రశ్నించదలచుకున్నట్లే తోచింది. కాస్సేపుండి అరవంలోనే ప్రశ్నలు సాగించాడు. అల్లాను ఎట్లా తెలుసుకోటం? ఎట్లా చూడటం? అని ఆ ప్రశ్నల సారాంశం. యథాప్రకారం "ఇన్నిటినీ విమర్శించే నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ వెనుక అల్లాను తెలుసుకుందువు గాని" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/492544084894911/?app=fbl
    "ఈ కర్రే అల్లా అనుకోని ధ్యానిస్తే అల్లా కనపడతాడా? అల్లాను ఎట్లా చూడటం" అన్నాడు మళ్ళీ ఆ యువకుడు. "ఎప్పుడూ చెడకుండా వుండే సత్యపదార్థానికే అల్లా అని పేరు. ముందు నిన్ను నీవు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది. అప్పుడు అల్లాను ఎట్లా తెలుసుకోటం అనే ప్రశ్న రాదు" అన్నారు భగవాన్. అయిందక్కడి కాయయ్య పని. సహచరులతో సహా లేచి వెళ్ళాడు. వారటు పోగానే ప్రక్కనున్న వారితో "చూచారా? అల్లాను చూడవలెనట. ఈ కంటితోనేనా చూడటం. ఈ కళ్ళ కెట్లా తెలుస్తుందో?" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
    నిన్న నొక హిందువు "ఓంకారమంటే ఈశ్వరునకు పేరా" అని భగవానులను ప్రశ్నించాడు. "ఓంకారమే ఈశ్వరుడు. ఈశ్వరుడే ఓంకారము, ఓంకారమే స్వరూపమన్నమాట. అసలు స్వరూపాన్నే కొందరు ఓంకార మంటారు. కొందరు శక్తి అంటారు. ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువొక్కటే" అన్నారు భగవాన్.

    నాలుగైదు రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకో  చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకొని ఆశ్రమవాసులగు భక్తులొకరు భగవానుల నిట్లా అడిగారు. "ఆనందం కూడా లయించేదే నన్నారు గదా, ఆ వెనుక ధ్యానం, సమాధి, సమాధానం అంటే ఏమిటి?"

    "లయమంటే ఏమిటి? ఆనందంతో ఆగిపోగూడదని. దాన్ని అనుభవించే వాడొకడుండాలి గదా? ఆ ఉండేవాన్ని తెలుసుకోవద్డా? తెలుసుకోకుంటే అది ధ్యాన మెట్లా అవుతుంది? అనుభవించేవాన్ని తెలుసుకుంటే వాడే తానాయె. తాను తానయినప్పుడు అదే అధ్యానమవుతుంది. ధ్యాన మంటే స్వరూపమన్న మాట. అదే సమాధానమున్నూ" అన్నారు భగవాన్.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ