రమణాశ్రమ లేఖలు 42 అభయం సర్వభూతేభ్యః 20-4-1946

రమణాశ్రమ లేఖలు 42 అభయం సర్వభూతేభ్యః 20-4-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/42-20-4-1946.html
    భగవాన్ ఈ మధ్య రోజు ప్రొద్దున బయటకి వెళ్ళబోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడిచెట్టు కాయలు కోయటానికి వచ్చిన కూలివాళ్ళు చెట్టెక్కి మెల్లగా కోయక క్రిందనుంచే గడలతో కొట్టటం ప్రారంభించారు. దానితో ఆకులు కూడా రాలుతున్నవి. ఇంకా సోఫామీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని, ఆ వెనుక బయటకి వెళ్ళే నిమిత్తం లేచి వచ్చి అటు చూచేసరికి రాలిన ఆకులు కొల్లలుగా భగవానుని కంట బడ్డవి. సహింపరాని కష్టం తోచింది వారికి. పట్టలేక పరుషస్వరంతో, "ఓహో చాలుచాలు ఇక పొండి. కాయలు కోయమంటే ఆకులు రాలేట్టు కొట్టటమా? మనకు కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడలతో బాదటమా చెట్టును? ఎవరీ పనికి నియమించింది? ఇట్లా కొట్టేబదులు మొదలంట నరికితే సరిపోతుందే! కాయలు కోయవద్దు ఏమీ వద్దు. పొండి పోం " డని గద్దించారు.
https://www.facebook.com/359807631501891/posts/493096194839700/?app=fbl
       ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవులలోనూ ధ్వనించి భయకంపితులను గావించింది. ఎత్తిన గడలు చాపకట్టగా నేల వ్రాలినవి. కూలివారు చేతులు కట్టుకొని నిలబడ్డారు. నోట మాటరాదు. నేనా ప్రక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూచే సరికి గుండె కొట్టుకొని నీళ్ళు గ్రమ్మినవి. చెట్టు ఆకులు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనస్సు నొప్పించుట కోర్వగలడా? కరుణాపూర్ణ సుదాబ్ది గదా రమణ భగవానుడు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
    శ్రీవారు గోశాల ప్రక్కకు వెళ్లి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగుజేశారు భక్తులంతాను. "అబ్బబ్బ! చూచారా ఎన్ని దెబ్బలు కొట్టారో. ఎంత గుట్ట అయిందో ఆకులపోగు? ఉస్సో" అంటూ హాల్లోకి వెళ్ళారు భగవాన్.

    భగవాన్ విరూపాక్ష గుహలో వున్నప్పుడు ఎచ్చమ్మగారు తన ఇంట్లో భగవాన్ పటము, శేషాద్రిస్వామి పటము పెట్టి, లక్షపత్రి పూజ చేయాలని సంకల్పించి భగవానులకు నివేదించి ప్రారంభించిందట. ఏబదివేలు పూర్తి అయ్యేసరికి వేసవి రావటం వల్ల పత్రి దొరకక ఒక రోజు కొండంతా తిరిగి,తిరిగి వేసట వచ్చి, భగవాన్ తో మొరపెట్టుకుంటే "పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదా?" అన్నారట భగవాన్. "అమ్మో, నొప్పి కాదా" అంటే, "ఒళ్ళు గిల్లితే నీకు నొప్పయితే పత్రి గిల్లితే చెట్టుకు నొప్పిలేదా?" అన్నారట భగవాన్. ఆమె తెల్లబోయి "ముందెందుకు  చెప్పలేదు స్వామీ?" అంటే నీ ఒళ్ళు గిల్లితే నొప్పని తెలిసినప్పుడు, పత్రి గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు? నేను చెప్పాలా" అన్నారట భగవాన్.

     పత్రములు గిల్లరాదనుటకు నిదర్శనంగా భగవాన్ అరవంలో అనువదించిన దేవికాలోత్తరం - జ్ఞానాచార విచారపటలము నందున్న శ్లోకమే వ్రాస్తాను చూడు.

శ్లో|| న మూలోత్పాటనం కుర్యా
    త్పత్రచ్చేదం వివరణయేత్
    భూతపీడాం న కుర్వీత
    పుష్పాణాం చ నిక్రుంతనం

తా|| వేళ్ళను పెల్లగించరాదు. ఆకులను గిల్లరాదు. భూతములను హింసింపరాదు. పూలను కోయరాదు

Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ