రమణాశ్రమ లేఖలు 40 ఆస్తి, భాతి, ప్రియంచ 11-4-1946
రమణాశ్రమ లేఖలు 40 ఆస్తి, భాతి, ప్రియంచ 11-4-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/40-11-4-1946.html
నిన్న ఉదయం పదీ పదకొండు గంటల మధ్యన ఒక పార్శీ డాక్టరు జాబొకటి తెచ్చి భగవానుల కిచ్చాడు. శ్రీవారు ఆ జాబొక భక్తులచే చదివించి "ప్రశ్న ప్రత్యుత్తరం. అన్నీ తానే వ్రాశారు గదా? ఇక చెప్పవలసిన దేమున్నదీ?" అన్నారు. ఆ జాబు ఇంగ్లీష్ కావడం వల్ల నాకు తెలియలేదు. కాని అది చదివిన వారు భగవానులను చూచి "ఆస్తి, భాతి, ప్రియంచ, అని వ్రాశారే, అర్థమేమిటి" అని ప్రశ్నించారు. 'ఆస్తి' అంటే సత్యమై ఉండునది. 'భాతి' అంటే ప్రకాశించునది. 'ప్రియం' అంటే ఆనందమైనది. అనగా సచ్చిదానందస్వరూపమన్నమాట. సత్తు, చిత్తు, ఆనందమునే ఆస్తి, భాతి, ప్రియం అంటారు. అన్నీ ఒకటే" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/494918364657483/?app=fbl
"ఆత్మ, నామరూపహితమైనదగుట జ్ఞానాతీత భక్తిచే ధ్యానింపవలెనా? అని ఉన్నదే ఆ జాబులో, అదేమీ?" అన్నారా భక్తులు. "ధ్యానింపవలెనన్న ద్వేత మేర్పడదా? ధ్యానించు వాడు, ద్యానింప బడేడిది అని రెండగునే? ఆత్మ నామరూప రహితమనుట నిజమే. నామరూపహితమగు దానిని ధ్యానించుటెట్లు? 'జ్ఞానాతీత భక్తి' అంటే, సాక్షి మాత్రమగు తానే గదా? తానే కన్నాయే. ఆ కన్ను అంతటను నిండి ఉన్నది. ఒకే కన్ను. మరి ధ్యానింప దగినదేది? ధ్యానించు వాడెవరు? అంతటను నిండిన ఆ కన్నే 'ఆస్తి, భాతి, ప్రియం;' 'సత్తు,చిత్తు,ఆనందము' ఇంకా ఎన్నెన్నో అయింది. ఎన్నో పేర్లు, ఉండే వస్తువు ఒక్కటే" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
'ఉన్నది నలువది' లో భగవాన్ వ్రాసిన ఒక వచనమున కిది వ్యాఖ్యానంగా అన్వయిస్తున్నది. చూడు:
తాను రూపమైనట్టయిన, జగదీశ్వరులును అట్లగా
వచ్చును. తాను రూపము కాని యెడల వాని రూపము
నెవ్వరెట్లు జూడగలరు? కన్ను లేక గనబడుట గలదా?
తానే కన్ను అదియో తుది లేని కన్ను.
T.me/BhagavanRaman
Comments
Post a Comment