రమణాశ్రమం లేఖలు 39 ఉమ 26-2-1946

రమణాశ్రమం లేఖలు 39 ఉమ 26-2-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/39-26-2-1946.html
    నేను ఈ లేఖారచన మారంభించక పూర్వం ఒకనాటి ఉదయాన ఒక భక్తుడు శ్రీవారి పురాణ గాథలను గురించి మాట్లాడుతూ "పార్వతికి 'ఉమ' అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో!" అన్నాడు. భగవాన్ నా వంక చూచి "తెలుగులో అరుణాచల పురాణం వున్నది గదూ!" అన్నారు. "లైబ్రరీలో వున్నది. తెస్తునా!" అన్నాను. "ఊ-ఊ" అన్నారు భగవాన్. వెంటనే వెళ్ళి లైబ్రరీలో వున్న పుస్తకం తెచ్చి శ్రీవారికిచ్చాను.
https://www.facebook.com/359807631501891/posts/495542837928369/?app=fbl
    భగవాన్ తెరచి చూస్తూ "ఇదిగో ఆ కథ ఇక్కడ ఉన్నది. దక్షాద్వరంలో దక్షుని తనయ, శివుని అర్థాంగి అయిన సతీదేవి తండ్రిచే అవమానితయై, ఆ శరీరం విడిచి, హిమవంతునికీ మేనకకూ జన్మించి, శంకరున్నే పతిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే, మేనక వద్దని వారించేటప్పుడు 'ఊ వద్దు. మా మానుము'. అనటం వల్ల 'ఉమ' అన్న పేరు వచ్చిందట. ఇదుగో" అని ఆ అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకిచ్చారు. నే నది తిప్పి తిప్పి చూస్తుంటే తమలో తామే నవ్వుకుంటున్నారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. కొంచెం నిదానించి భగవానే ఇట్లా సెలవిచ్చారు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
    "ఇదుగో, దాని ప్రక్కనే ఇంకొక విషయం వున్నది. మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట. ఇక లాభం లేదని తండ్రి హిమవంతుడామెను వెంట బెట్టుకొని తపోవనంలో దక్షిణా మూర్తిగా నున్న శివుని వద్దకు వెళ్ళి 'ఈ నా బాలిక తపస్సు చేసుకుంటుందట. తమ అండన ఉండనీయం'డని ప్రార్థించాడు. శివుడు ఆ పార్వతిని చూచి 'ఈ చిరుత వయస్సులో తపస్సెందుకు? తండ్రితో ఇంటికి పోరాదా?" అన్నాడు. 'ఉహూ,పో ' నన్నది పార్వతి. పరమేశ్వరుడు ఒక యుక్తితో 'నేను ప్రకృతిని జయించి తపోనిష్టతో వున్నాను. నీవు ఇక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తవి. కాబట్టి నీవు వెళ్ళిపో' అన్నాడు. పార్వతి సమయజ్ఞ గదా. 'ప్రభో! తాము ప్రకృతిని జయించామంటున్నారే, ప్రకృతి లేకుంటే, తపస్సెట్లా చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడారే ప్రకృతి సంబంధం లేకుంటే ఎట్లా మాట్లాడగలరు? ఎట్లా నడువ గలరు? మీకు తెలియకుండానే ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకొని వున్నది. వృధా వాగ్వాధమే గాని, ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నే నున్నందువల్ల భయమేమిటి?" అన్నదట పార్వతి. శంకరు డదివిని మందహాసంతో 'ఇంగితజ్ఞ! మధురవచనీ!' ఉండుమని చెప్పి హిమవంతుని ఇంటికి పంపాడట. ఈ కథ ఆ పుస్తకంలో ఇంకా విపులంగా వున్నది."

    "అట్లాగా! దాక్షాయణి కథ భాగవతంలో వున్నది గాని ఈ సంభాషణ లేదు. చాలా చిత్రంగా ఉన్నదే?" అన్నా నేను. భగవాన్ నవ్వుతూ "అవునవును. ఇంకొకటి కూడా దేనిలోనో చదివాను. కామదహనమైన వెనుక పరమేశ్వరుడు, బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించడం, వెనుక పార్వతి పరిణయం అన్నీ అయిన వెనుక, తన అల్లుడు ఏ జాతి వాడో ఏమోనని హిమవంతునకు కించగా ఉండేదట. ఏం చేస్తాడు? ఎవరిని అడిగినా ఎమోననే వారే గాని ఎరుగుదుమనేవారు లేకపోయారు. పలక  కుండా ఊరకున్నాడు. వెనుక పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్ళు మూయడం, లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు ఫాలనేత్రం తెరచి రక్షించడం జరిగాక తన తప్పెరిగిన దేవి తపస్సుకై బయలుదేరి, అక్కడక్కడ నిలిచి తపస్సు చేస్తూ, కడపట ఇక్కడికి వచ్చి తపస్సు చేత అరుణగిరీశుని మెప్పించి అర్థ శరీరం పొందింది గదా. ఆ సమాచారం హిమవంతునికి తెలిసి 'ఆ-సరిసరి. అయితే అల్లుడు అన్యజాతివాడు కాడు. మన జాతి వాడే' నని ఆనందించాడట. ఇదీ కొండే, తానూ కొండే గదా. అదొక తమాషా" అన్నారు భగవాన్.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ