రమణాశ్రమ లేఖలు 38 ఆత్మస్వరూపం - చిరంజీవులు 21-2-1946
రమణాశ్రమ లేఖలు 38 ఆత్మస్వరూపం - చిరంజీవులు 21-2-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/38-21-2-1946.html
మొన్న యడవల్లి రామశాస్త్రి గారు వచ్చారిక్కడికి. వారు భగవానుని ఇట్లా అడిగారు. "స్వామీ! పరమమైన ఆత్మ స్వరూపము కోటి సూర్య ప్రభాసిత మంటారే నిజమేనా?" "అవునండీ. కోటి సూర్యసమకాంతి గలదేననుకోండి. ఎట్లా నిర్ణయిస్తారు? ఈ కళ్ళతో ఒక్క సూర్యునే చూడలేమే, కోటి సూర్యుల నెట్లా చూడగలం? ఆ కన్ను వేరండీ. ఆ కంటితో చూడగలిగినప్పుడు ఆ పరాత్పరమైన ఆత్మస్వరూపానికి ఏ పేరైనా పెట్టుకోండి. కోటి సూర్యులో, కోటిచంద్రులో, ఏదో ఒకటి" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/496256007857052/?app=fbl
ఇట్లాగే ఆ మధ్యనొకరు "అశ్వత్థామ విభీషణుడు మొదలైన వారంతా చిరంజీవులనీ, వారిప్పటికీ ఎక్కడో ఉన్నారనీ అంటారు నిజమేనా?" అంటే, "ఆహా నిజమే. చిరంజీవు లంటే ఏమని మీ తాత్పర్యం? ఎప్పుడూ చెడని స్థితి ఏదో అది తెలుసుకొన్నారు అని. నిజస్థితిని తెలుసుకున్న వారికి మరణమేది, జననమేది? వారు చిరంజీవులై ఎప్పుడూ ఎక్కడా ఉంటారు. మన మిప్పుడు వారిని గురించి మాట్లాడుతున్నాము గనుక వారిక్కడున్నట్లే గదా? అట్లాగే ఎప్పుడు, ఎవరు, ఎక్కడ తలచుకుంటే అక్కడే ఉంటారు. వారు కీర్తికాయులు. చిరంజీవితమంటే పాంచ భౌతికమైన ఈ జడశరీరానికా? దీన్ని వారు లక్షింపరు. బొమ్మరిళ్ళలాగా బ్రహ్మ కల్పాలే తారుమారవుతుంటే ఆ కల్పాలలోని కల్పిత చిత్రాలకు స్థిరత్వం కల్పించటం పొసగుతుందా!" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
T.Me/BhagavanRaman
Comments
Post a Comment