రమణాశ్రమ లేఖలు 37 శరీరంతో మోక్షం 20-2-1946
రమణాశ్రమ లేఖలు 37 శరీరంతో మోక్షం 20-2-1946
https://bhagavanraman.blogspot.com/2018/10/37-20-2-1946.html
దాదాపొక వారం క్రిందట నూతనాగతులొకరు భగవానులను సమీపించి "ఈ శరీరంతో శాశ్వతంగా ఇట్లాగే వుండి మోక్షం పొందవచ్చునా?" అని ప్రశ్నించారు. "అసలు మోక్షమంటే ఏమిటి? పొందే దెవరు? బంధం వుంటే గదా మోక్షం? ఆ బంధం ఎవరికీ?" అన్నారు భగవాన్. "నాకే" నన్నారా పృచ్చకులు. "నీవంటే ఎవరు? బంధం నీకు ఎట్లా వచ్చింది? ఎందుకొచ్చింది? అది ముందు తెలుసుకుంటే, ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దాం" అన్నారు భగవాన్. వారిక మాట్లాడలేక విరమించుకొని కొంచెం సేపు ఉండి లేచిపోయినారు.
https://www.facebook.com/359807631501891/posts/497485821067404/?app=fbl
వారు వెళ్ళిన వెనుక అనుగ్రహపూరిత దృక్కులతో అందరినీ చూచి "చాలా మందికిదే ప్రశ్న. ఈ శరీరంతో ఇట్లాగే మోక్షం పొందాలని. ఇదొక సంఘం. ఇప్పుడే గాదు. పూర్వం గూడా ఎందరెందరో కాయకల్పవ్రతాలనీ, అవనీ,ఇవనీ, ఏమేమో చెప్పి, ఈ శరీరాన్ని వజ్రతుల్యం చేయవచ్చనీ, ఈ బొందితోనే కైలాసానికి పోవచ్చనీ శిష్యులకు బోధించటమే గాక, ఎన్నెన్నో గ్రంథాలు వ్రాసి పెట్టేవారు. ఇంతా చెప్పి ఇన్నీ చేసి, ఎన్నో వ్రాసి, కడకు ఎప్పుడో ఒకప్పుడు కాలానికి వశమై వారూ పోయేవారు. చెప్పినట్టీ చేసినట్టీ గురువే పోతే శిష్యులకే ముందిక? ఇప్పుడు చూచింది ఇంకొక క్షణాని కేమవుతుందో మనకు తెలియదు. ఈ శరీరం నేను కాదని విచారించి తెలిసి, దాన్ని లక్ష్యం చేయని వైరాగ్య వంతునకు గాని శాంతి కుదరదు. శాంతి కుదురుటే గదా మోక్షం? శరీరం నేనను భ్రాంతి ఉన్నంతవరకు శాంతి కుదరదంటే ఈ శరీరాన్ని ఇట్లాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే బంధం ఎక్కువౌతుందే గాని తగ్గటం ఎట్లా సంభవిస్తుంది? ఇదొక భ్రాంతి" అన్నారు భగవాన్. https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
T.me/BhagavanRaman
Comments
Post a Comment