రమణాశ్రమ లేఖలు 36 కౌపీనవన్తఃఖలు భాగ్యవన్తః 5-2-1946
రమణాశ్రమ లేఖలు 36 కౌపీనవన్తఃఖలు భాగ్యవన్తః 5-2-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/36-5-2-1946.html
భగవాన్ ఈ మధ్య అచ్చయి వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూస్తున్నారు గదా? ఆ సందర్భంలో "తుండుగుడ్డ కథ వ్రాశారా?" అని రంగసామి అడిగాడు నిన్న. ఆ కథ పుస్తకంలో లేనందున భగవాన్ ఇట్లా చెప్పారు: "నేను పచ్చయమ్మన్ కోవెలలో ఉండగా, సుమారు నలువది యేండ్లు కావచ్చు. లో ననుకుంటా, ఎవరో తెచ్చి ఇచ్చిన మళయాళపుతుండు ఒకటే నా వద్ద వుండేది. అసలే దానినేత అంతంత మాత్రం గదా. రెండు నెల లయ్యేసరికి లెక్కలేనన్ని చిల్లులతో తయారయింది. పలనిస్వామి వూళ్ళో లేడు. వంట మొదలైన పనులన్నీ మనమే చూచుకోవలసి వచ్చింది. ఆ చేయి ఈ చేయి తుడవటం వల్ల రంగున్నూ ఎట్లా ఉండాలో అట్లా వున్నది. కప్పుకుంటే పస బయట పడుతుందని ఉండగా చుట్టి దగ్గర పెట్టుకునేవాన్ని. అదెట్లా వుంటే మనకేమి? పని గడిస్తే సరిపోయే. స్నానం చేసినప్పుడు అట్లాగే తుడుచుకొని వచ్చాను. ఒక కడజాతి కొంటెపిల్లవా డొకనాడది దులుపుతుంటే చూచి 'సామీ సామీ, గవర్నరుకు కావాలట యీతుండు. అడిగి తెమ్మన్నాడు సామీ, ఇయ్యండి బాబూ' అంటూ పరిహాసంగా చేతులు జాచాడు. 'అమ్మా, ఈ తుండా? ఊహూ, ఇవ్వను,పో,పొమ్మన్నాను.
https://www.facebook.com/359807631501891/posts/497485821067404/?app=fbl
"ఆ తుండు రానురాను మరీ వేయికంతలలో తయారైతే శేషయ్యరు ఇత్యాదుల కంట పడుతుందేమోనని దగ్గర పెట్టుకోవటం మాని, స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ, చాటుగా ఆరవేసి, కోవెల ప్రాకారంలో ఉన్న చెట్టు తొర్రలో దాచి పెడుతూ వచ్చాను. ఒకనాడు నే నెక్కడికో వెళ్ళినప్పుడు శేషయ్యరు వాళ్ళు ఏదో వెతుకుతూ ఆ తొర్రలో చేయి పెట్టేసరికి తుండు దొరికిందట. దాని వాలకం చూచి నొచ్చుకొని నేను వచ్చేసరికి 'అపరాధమైంది సామీ' అంటూ దుఃఖించటం మొదలుపెట్టారు. "ఏమయ్యా కథ' అంటే, 'అయ్యో, వేయికంతలతో వున్నా ఈ తుండువాతోనా స్వామీ తడి ఆర్చుకోవటం, మా భక్త బండలుగాను! ఇంత మాత్రం కనుక్కోలేకపోతిమే' అని నొచ్చుకొని బొత్తులుగా కొత్తవి తెచ్చి పెట్టారు.
https://www.facebook.com/359807631501891/posts/497485821067404/?app=fbl
"ఈ కథకు ముందే ఇంకోటిగూడా జరిగింది. ఏమంటే, నా కౌపీనం చినిగింది. కావాలని ఎవరినీ అడగనాయే. గుట్టు బయటపడగూడదు. కుట్టుకుందా మంటే సూదేదీ? దారమేదీ? కడకొక రక్కెసముల్లు సంపాదించి, ఆ కౌపీనంలోని నూలె మెలిపి, ఆ ముల్లుకొక కంత చేసి దారం దూర్చి, ఎట్లాగో కుట్టి ఆ కుట్లు కనపడకుండా మదిహి ధరించేవాన్ని. కాలం గడిచిపోయేది. మనకేం గావాలి? ఆరోజు లటువంటివి' అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
ఇది చెప్పటం వారికైతే సహజంగానే వుందిగాని విన్న మా మనస్సు విస్తుబోయింది. ఈ సంగతులు లోగడ భగవాన్ చెప్పగా విని మురగనారు పాట వ్రాశారట. "ముల్లుచేత కుట్టబడిన కౌపీనమును ధరించినట్టిన్నీ, సహస్రాక్షుడు చేతితుండుగా వచ్చి సేవించినట్టిన్నీ ఓ వెంకట రమణా!" అని ఆ పాట భావం. ==>
T.me/BhagavanRaman
Comments
Post a Comment