రమణాశ్రమ లేఖలు 34 పుస్తకం 1.2.1946

రమణాశ్రమ లేఖలు 34 పుస్తకం 1.2.1946
http://bhagavanraman.blogspot.com/2018/10/34-121946.html
      1944లో ఒకనాటి ఉదయాన ఎనిమిదీ తొమ్మిదీ, ఆ ప్రాంతంలో భక్తుడు దీనాననుడై శ్రీవారిని సమీపించి "భగవాన్ ! పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూచుకుందామంటే చదువు రాదే, ఏం చేసేది? నేను ఏలా తరించగలను?” అన్నాడు. “చదువు రాకుంటే ఏమి? నిన్ను నీవు తెలుసుకుం చాలును" అన్నారు భగవాన్. “ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటు ఉంటారే. నాకేమీ చేతకాదాయే ఎలా?" అన్నాడు అతడు. భగవాన్ చెయ్యి అతనివైపు చాచి ఆడిస్తూ “పుస్తకం ఏం చెపుతుందంటావు నిన్ను చూచుకొని నన్ను చూడమంటుంది. అద్దం చేత పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూచుకో అని చూపినట్లే, తన ముఖం ఏ విధంగా ఉంటే, ఆ విధంగానే కదా కనపడేది. ముఖం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది. లేకుంటే ఇక్కడ మసి ఉంది, అక్కడ అది ఉంది, కడుక్కొనిరా అని చెపుతుంది. పుస్తకమూ అంతే. తన్ను తాగన్న తరువాత పుస్తకం చూస్తే అన్నీ అర్థమౌతవి. తన్ను తా చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు. ముందు నిన్ను సరిచేసుకొని నన్ను చూడు అంటుంది. అంతే. నిన్ను నీవు చూచుకో.. అదంతా నీ కెందుకు". అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/498707130945273/?app=fbl
    అతడంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్ళాడు. చొరవగల భక్తులొకరు అందుకొని
“భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే” అన్నారు. “చిత్రమేమున్నదండి.
అదంతా యథార్థమే. నేను మొదట ఏ పుస్తకాలు చదివాను? ఎవరివద్ద ఏం
తెలుసుకున్నాను? ఒకే నిష్ఠలో ఉంటూ ఉండేవాణ్ణి. కొవ్నాళ్ళకు పళనిస్వామి,
టవునులో ఒకరివద్ద నుండి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులు
తప్పులుగా చదువుతూ ఉండేవారు. వయస్సయిన వారు. సరిగా చదువురాదు.
చదవాలన్న ఆశ మాత్రం ఉంది. పట్టుదలతో శ్రద్దగా చదివేవారు. ఆ పట్టుదలా శ్రద్ధా చూచి నాకు సంతోషం కలిగేది. అందువల్ల మనమే చదివి చెపుదామని

     ఆ గ్రంథాలు తీసుకొని చదివితే, అందులో వచ్చేదంతా మనకు ముందే
అనుభవమైనదీగా ఉండేది. అరే, మన విషయం ఇందులో రాసివుందే. ఇదేమి?
అన్నట్లు ఆశ్చర్యం కలిగించేది. ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే. విషయమంతా
అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూచినా క్షణంలో అర్థమయ్యేది. వారు
ఇరువది రోజులలో చదివే పుస్తకం నేను రెండు రోజులలో చదివి ముగించే
వాణ్ణి. వారది యిచ్చి యింకొకటి తెచ్చేవారు. ఈ విధంగానే నాకు గ్రంథపరిచితి
కలిగింది అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
శివప్రకాశం పిళ్ళై భగవానుని చరిత్ర రాస్తూ ముందే, 'బ్రహ్మమెన్నుం పేరరయామలె బ్రహ్మజ్ఞానం పెట్ర పులవర్' (బ్రహ్మమను పేరు తెలియకయే బ్రహ్మమైన జ్ఞాని) అన్నారు ఇందుకే కాబోలు?” అన్నారు భక్తులు. “ఊ ఊ. అది సరి. అందుకే తన్నుతా చూచి పుస్తకం చూస్తే మంచిదన్నారు. అలా చేస్తే ఉన్నదానికి పరిభాషరా యిది అని తెలుస్తుంది. తన్ను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు అంటుంది” అన్నారు భగవాన్. “భగవాన్ వలె కావటం అందరికీ సాధ్యమా? అందువల్ల గ్రంథసహాయం ఉంటే లోపాలు సరిదిద్దు కోటానికైనా వీలేకదా?” అన్నారా భక్తులు. “అది సరి. చదువు సహాయం కాదనలేదండీ. చదువు రాదే ఎట్లాగ తరించడం, అన్న విచారంతో క్రుంగి పోవలసిన పని లేదన్నామే కాని, చదవరాదన్నామా? చూడండి. అతడు ఎంత దిగాలుపడుతూ అడిగాడో. అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా క్రుంగిపోరూ?” అన్నారు భగవాన్.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ