రమణాశ్రమ లేఖలు 33 అర్చిరాది మార్గాలు - ఉత్తమలోకాలు 31-1-1946

రమణాశ్రమ లేఖలు 33 అర్చిరాది మార్గాలు - ఉత్తమలోకాలు 31-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/33-31-1-1946.html
   ఈ ఉదయం అర్చిరాది మార్గాలను గురించి వ్రాసిన వ్యాసం పేపర్లో చదివి "అర్చిరాది మార్గాలూ తద్ద్వారా ఉత్తమలోకాలూ అని ఏమేమో వ్రాస్తారు. అన్ని లోకాలు ఇట్లాగే ఉంటవి. అతిశయమేమున్నదీ. ఇదుగో, ఈ రేడియో పాడుతున్నది. ఇందాక మద్రాసు పాట. ఇప్పుడు తిరుచునాపల్లిది. మళ్ళీ తిప్పితే మైసూరు. ఇన్ని ఊళ్ళూ ఈ రేడియోలోనే తిరువన్ణామలలో వున్నవి. అట్లాగే అన్ని లోకాలును. మనస్సు తిప్పితే సరి. అన్నీ ఒక్క క్షణంలో చూడవచ్చును. ఏం లాభం? భ్రమించి తిరిగి తిరిగి వేసరుటేగాని శాంతి ఏదీ? అది కావాలంటే యదార్థం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనస్సు శాంతిలో అణగదు" అన్నారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/499356557546997/?app=fbl
    ఇట్లాగే ఆ మధ్యనొకరు "వైకుంఠమనీ, కైలాసమనీ, ఇంద్రలోకమనీ, చంద్రలోకమనీ అంటారే, అవన్నీ నిజంగా ఉన్నవా?" అని భగవంతులను ప్రశ్నించారు. "అవునండీ, నిజంగా వున్నవనుకోండి. అక్కడా ఇట్లాగే ఒక స్వామి కూర్చొని ఉంటాడు. ఇట్లాగే భక్తులు పరివేష్టించి వుంటారు. ఏదో వారడుగుతారు.ఏదో వీరు చెపుతారు. అంతా ఇట్లాగే ఉంటుంది. అయితే ఏమయిందీ? చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమనీ, ఇంద్రలోకం చూస్తే వైకుంఠమనీ,  వైకుంఠము చూస్తే కైలాసమనీ, ఇదనీ అదనీ మనస్సు పరిభ్రమిస్తూనే ఉంటుంది. శాంతి ఏదీ? అది కావాలంటే ఇన్నిటినీ యోచించే తన్నుదానెరుగుటే సరియైన పంథా. తన్నుదా నెరిగితే ఇన్ని లోకాలను సంకల్పమాత్రాన తనలోనే తా గనవచ్చును. ఇన్నిటికీ మూలమైన తన్నుదా గన్నచో తనకన్నా అన్యమేదియు గనరాదే? అప్పుడు ఈ ప్రశ్నయే రాదు. ఆ వైకుంఠమూ, కైలాసమూ ఉండనీ, ఉండకపోనీ, నీ వున్నావనుట నిజమే గదా. నీ వెట్లా వున్నావు? ఎక్కడున్నావు! నీ స్థితీ గతీ నీవు తెలుసుకో ముందు. ఆ వెనుక ఆ లోకాలను గురించి ఆలోచిద్దాం" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ