రమణాశ్రమ లేఖలు 32 అవ్వయార్ పాట 30-1-1946


రమణాశ్రమ లేఖలు 32 అవ్వయార్ పాట 30-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/32-30-1-1946.html
    నాల్గురోజుల నుంచీ భగవాన్ ఈ మధ్య అచ్చయి వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూడడం ప్రారంభించారు. దానిలో వ్రాసిన అవ్వయార్ పాట తాత్పర్యము చూచి అది సరిగా లేదన్నారు భగవాన్. దానిలో తాత్పర్యము ఈ విధంగా వ్రాసి వున్నది.
https://www.facebook.com/359807631501891/posts/500042477478405/?app=fbl
    "ఓ కడుపా! ఒకనాడును దినుట మానవు. పోనీ, రెండు నాళ్ల తిండి నొక దినమే తిందువా? అట్లును జేయవు. నా కష్టము చూడుము. నీతో నుండుట కష్టము."

    ఈ తాత్పర్యము సరిగా లేదనీ, అది ఇట్లా ఉండాలనీ భగవాన్ చెప్పారు.  "ఒకనాడైన తినుట మానవు. రెండురోజుల కొకసారైన తినవు. ఒకనాడైన నా కష్టము గనవు. ఓ కడుపా, నీతో నుండుట కష్టము సుమా" అంటాడట జీవుడు. అంటే జ్ఞానులకు కర్మతో గూడిన ఈ శరీరంతో వుండటం కష్టంగా వుంటుంది. మరణమంటే కష్టమే లేదు. ఏమంటే ప్రాణం పోవుట స్వస్థితియందడుగుటే గదా వారికి? అందువల్ల కర్మతో గూడిన ఈ శరీరమందు ఉండుట వారికి కష్టము. ఇదే ఆ పాట వ్రాసిన పెద్దల అభిప్రాయం."
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
    మనబోటోళ్ళకు చావంటే భయం. ఎందువల్ల? ఈ శరీరమే "నేను" అను అభిమానం పోనందువల్ల. స్వస్థితి యధార్థం తెలుసుకొన్న వారికి శరీరధారణమే భారంగా వుంటుంది. దీనితో కూడి ఉన్నంతకాలం నిద్రహారాదుల కొరకైనా గమనాగమనం తప్పదాయే. అదిన్నీ వారి సుఖానుభూతికి అంతరాయంగానే వుంటుంది, వేసంగిలో మనకు కట్టుబట్టే భారంగా వున్నట్లు. మీదు మిక్కిలి వారికేదైనా ఉపచారం చేయబోతే చెమట బాధ వల్ల పైబెట్టే తోసేద్దామని వుంటే ఫుల్ సూటువేసుకో మన్నట్లుంటుంది గాబోలు? ఈ కడుపుతో వేగటం కష్టమంటాడట జీవుడు. దానికి బదులు భగవాన్ వ్రాసిన పాట తాత్పర్యం దిగువన వున్నది. కడుపే "నీతో వేగటం కష్టం బాబూ" అంటుందట జీవుణ్ణి. వారి చమత్కారం చూడు.

    "ఓ జీవుడా, కడుపునైన నాకు ఒక గడియయైనను విశ్రాంతి నివ్వవు. ఒక గడియయైనను తినుట మానవు. ఏ దినమును నా కష్ట మెరుగవు. నీతో జీవించుట దుర్లభము" ఇదీ తాత్పర్యము. "అంటే ఒక గడియయైన గాలి పీల్చుట మానడట జీవుడు. నీతో జీవించుట కష్టం బాబూ అంటుందట కడుపు" అని వివరించి చెప్పారు భగవాన్.

    ఈ లేఖ భగవాన్ సన్నిధిలోనే చదివితే తమిళ భక్తులొకరు విని, విషయమడిగి తెలుసుకొని "అవ్వయార్ పాట ప్రసిద్ధమేగాని, భగవాన్ వ్రాసింది బహు చిత్రంగా ఉన్నదే. కడుపు మీద కారుణ్యం చూపింది భగవానే తప్ప మరెవ్వరూ లేరు. ఏ సందర్భంలో వ్రాసారో భగవాన్" అన్నారు. భగవాన్ నవ్వుతూ "అదా! ఒక చైత్రపూర్ణిమ నాడు పిండివంటలతో సహా అంతా సుష్టుగా తిని కూర్చున్నాం. ప్రొద్దుపోయి భోజనం చేయుటవల్ల అందరికీ భుక్తాయాసంగానే వున్నది. అందులో సోమసుందర స్వామి హాల్లో పడుకొని దొర్లుతూ పొట్ట నిమురుకుంటూ,

ఒరునా ళుణవై ఒళియెన్ రా లోళియాయ్
యిరునాళై క్కే లెన్రా లేలాయ్ - ఒరునాళుం
ఇడుంబైకూ రెన్వయిరే నీ పోహాయ్
ఉన్నోడు వాల్ద లరిదు.

అని అవ్వయార్ వ్రాసిన వెణ్పా పాడారు, నేనప్పుడు తమాషాగా,
ఒరునా లిహైవయిరే ర్కోయ్ వీయాయ్ నాళుం
ఒరునాళి హైయున్ప దోయాయ్ - ఒరుణాలుం
ఎన్నో వరియా యిడుమ్బైకూ రెన్నుయిరే
యున్నోడు వాల్ద లరిదు.

అని వెన్పాయే వ్రాసి పాడాను. ఇప్పుడది చదివింది ఆ రెండు పద్యాల తాత్పర్యమే" నన్నారు.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ