రమణాశ్రమ లేఖలు 31 ఆలయంలో అలంకారాలు 27-1-1946
రమణాశ్రమ లేఖలు 31 ఆలయంలో అలంకారాలు 27-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/31-27-1-1946.html
గత నవరాత్రి పండుగలకు ఇక్కడ మాతృభూతేశ్వరాలయంలో పూజలు అలంకారాలు జరగటం, మొదటి రోజున మీరు కూడా చూచారు గదా. తొమ్మిది రోజులు రోజుకొక అలంకారం చేయటంలో ఒక రోజున అంబ శివుని ఎడబాటు సహించలేక తపస్సు చేసిందనే పురాణగాథననుసరించి, ఒక చెట్టు నీడన ఆమె నివసించినట్లలంకరించి రాత్రి భోజనానంతరం, భగవానులకు చూపగా చూచి వచ్చారు.
https://www.facebook.com/359807631501891/posts/500682740747712/?app=fbl
మర్నాడు ఉదయం హాలులో ప్రసంగవశంగా అరుణాచలేశ్వరుని కోవెలలో అలంకారాలను గురించీ, ఇక్కడి అలంకారాలను గురించీ మాట్లాడుతూ భగవాన్ ఇట్లా అన్నారు! "నిన్న అంబ తపస్సని అలంకరించారు. భర్త ఎడబాటుచే పరితపించే పార్వతి పట్టు చీరకట్టుకొని, బంగారు నగలు పెట్టుకొని, పూలమాలలు ధరించి ఒయ్యారంగా చెట్టు క్రింద కూర్చున్నదట. ఎంత సందర్భంగా ఉన్నదో చూడండీ అలంకారం. మనవాళ్ళు చేసేదంతా ఇట్లాగే వుంటుంది. తపస్సంటే తపనగదా? పరిహాసార్థం పరమేశ్వరుని కళ్లుమూసిన పార్వతిని పరమేశ్వరుడు ఆ దోషనివారణార్థం తపమొనర్ప నియోగించుట చేత పతిని విడిచి వచ్చి అనుతప్తయై కృశించి తదేక దీక్షగా శరీరమును మరచి ఘోరతప మొనర్చే అంబ వేషమట చూడండి ఎట్లా ఉన్నదో! రవ్వలూ కేంపులూ పెట్టుకొని, పట్టుచీరే కట్టుకొని, బంగారు పతకాలూ పూలమాలలు వేసుకొని మహారాణీ లాగా వున్నది". https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
T.me/BhagavanRaman
Comments
Post a Comment