రమణాశ్రమ లేఖలు 29 అది ఆట , ఇది తేట 23-1-1946)

రమణాశ్రమ లేఖలు 29 అది ఆట , ఇది తేట 23-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/29-23-1-1946.html
   ఆ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెపుతూ భాగవతాంతర్గత 'హంసగీత'లో  ఉత్తమ సిద్దలక్షణం తెలుపు శ్లోక మొకటి జ్ఞప్తికిరాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం వ్రాసారు. బలరామిరెడ్డి గారు అక్కడే వుండి "తెనుగులోనో" అనటంవల్ల మొన్న ఉదయం భగవాన్ ఆటవెలదిలో ఆ శ్లోకానికి అనువాదం వ్రాసి, ఆ చిన్న గీతంలో భావం ఇమడలేదనో ఏమో అనుకుంటూ వుంటే "తేటగీతమైతే నయమేమో" అన్నా నేను మెల్లిగా. "అట్లాగే మార్చవచ్చు" అంటూ, "అది ఆట. ఇది తేట" అన్నారు భగవాన్. నాకేదో చిత్రమనిపించింది.
https://www.facebook.com/359807631501891/posts/501888143960505/?app=fbl
   మధ్యాహ్నం రెండున్నరకు నేను వచ్చేసరికి తేటగీతలో వ్రాసి "అంతా సరిపోయిందా చూడండి" అని నాకిచ్చారు భగవాన్. నడక బాగా సాగనట్లున్నా భగవాన్ వ్రాసిందే చాలన్న సంతోషంలో ఏమీ గమనించక "భగవాన్ ఎట్లా వ్రాసినా నాకు బాగానే ఉంటుం" దన్నాను. "పోనీ ఈ చేతగాని వాడు వ్రాసింది ఒకరికైనా బాగుంటే అంతే చాలు" నన్నారు భగవాన్. ప్రక్కన వున్నవారు పక్కున నవ్వారు. తాము చేతగానివారట. ఇతురులంతా గొప్ప పండితులట! మాద్రుషుల కిది తాకిరావాలని అనేమాట గాక మరేమున్నది?
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
   అంతటితో పోయిందా. "ఇక్కడ భావం లోపించింది. అక్కడ వ్యాకరణం పోయింది" అంటూ రోజుల్లా బలరామిరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక విధంగా వ్రాసిన పద్యం, శ్లోకం, సాఫీ వ్రాసిన కాగితం నాకిచ్చారు భగవాన్. ఇంటికి తెచ్చి చూచేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమేగాక ఆశ్రమం నోటుబుక్కులో కాపీ చేసి ఈ కాగితం మనం వుంచుకుందామన్న ఆశ కలిగి చక్కగా కత్తిరించి సంచిలో వుంచుకొని ఎనిమిదింటికి ఆశ్రమానికి వెళ్ళాను. నమస్కరిస్తుండగానే నేనే అక్షరం సందేహించానో అదే చెప్పి, "మార్చాలి. నా కాగితం నాకిచ్చెయ్యండి. మరెవ్వరన్నా అడిగితే చూపవద్దూ?" అన్నారు భగవాన్. నా మనోగతాభిప్రాయాలు రెండూ గ్రహించినట్లే. నాకు ఆశ్చర్యం వేసింది.

   లోగడ ఇట్లాంటి సంభవాలెన్నో జరిగినవి. కాని నా కాగితం నకిచ్చెయ్యమని పట్టుబట్టి బడిపిల్లవాడడిగినట్లు భగవాన్ అడిగితే నాకు ఆశకు సిగ్గూ, వారి అదిలింపుకు వెరపూ, చిలిపి మాటలకు నవ్వూ ఒకేసారి వచ్చినవి. "తెచ్చాను ఇస్తా" నని ఇచ్చాను. ధనం దాచుకున్నట్లు దాచుకున్నారు. ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదనీ, అదనీ,ఇదనీ నిన్న అంతా గడిపారు. నన్నడిగితే "భగద్వాణికి వ్యాకరణ మడ్డుకుంటుందా?" అన్నాను. "అది సరేలే" అని నవ్వారు భగవాన్. చివరకెట్లాగో శ్రీవారే తేటగీతలో చక్కగా తయారు చేసి వ్రాసుకొమ్మని ఇవాళ నాకిచ్చారు. వారి కాగితం వారికిచ్చే ఒప్పుదలమీద. ఈ చిన్న పనికి మూడు రోజులు మాతో ఆటలాడినట్లు మాటలాడి తేటగీతలో ముగించారు చివరకు. "అది ఆట. ఇది తేట" అన్న వారి మాటలకిదే అర్థం కాబోలు. ఆ పద్యం దిగువన వ్రాస్తున్నాను.

తే. ఒడలు నశ్వర మది స్థితం బుత్త్దితంబో
   కర్మవశమున విడువడ గలయగలదో
   తన్నెరింగిన సిద్ధుడు తనువు గనడు
   గుడ్డను మదిరామదమున గ్రుడ్డివలేనే.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ