రమణాశ్రమ లేఖలు 28 బ్రహ్మాస్త్రము 22-1-1946

రమణాశ్రమ లేఖలు 28 (22-1-1946)
http://bhagavanraman.blogspot.com/2018/10/28-22-1-1946.html
       నిన్ననో మొన్ననో ఒక పిల్లడు, 18 యేల్లుండవచ్చు. ఎక్కడినుంచో సైకిల్ మీద వచ్చాడు. హాల్లో పావుగంట కూర్చొనిన వెనుక భగవంతులను సమీపించి "ఓంకారం దాటాక ఎక్కడ అణగాలి?" అని ప్రశ్నించాడు. భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా, "ఓహో అట్లాగా; నీవిప్పుడెక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళతావు? ఏం తెలుసుకోవాలి? అసలునీవెవరు? అని ముందు చెపితే తరువాత ఓంకారాన్ని గురించి ప్రశ్నింతువు గాని" అన్నారు. "అది నాకు తెలియదే" అన్నాడు ఆ చిన్నవాడు. 'నీవున్నావన్నమాట స్పష్టమే గదా? నీవెట్లా వున్నావు! ఎక్కడున్నావు? అసలు నీ స్వరూపమేది? అది తెలుసుకో ముందు. తెలిసిన వెనుక ప్రశ్న వస్తే, అడుగుదువుగాని. ఓంకారం ఎక్కడ అణగితే మనకెందుకు? ఎట్లా వస్తున్నావు? నీ స్థితీ గతీ ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం" అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడా కుర్రవాడు. పృచ్చకుల కింతకంటే బ్రహ్మాస్త్రమేమున్నది? దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేరు సుమా.
https://www.facebook.com/359807631501891/posts/502539227228730/?app=fbl
"నీవెవరవో? తెలుసుకొమ్మనే ఈ బోధకు బ్రహ్మాస్త్రమనే పేరెవరు పెట్టారమ్మా?" అని అంటావేమో. రెండు మూడేండ్ల క్రితం ఒక సన్యాసి వచ్చి "అది చదివాను. ఇది చదివా" నంటూ శ్రీవారిని ఏమేమో ప్రశ్నిస్తూ వుంటే "నీవెవరవో తెలుసుకొ" మ్మనే పాయింటుతోనే చాలా సేపు సమాధానాలిస్తూ వచ్చారు భగవాన్. కడకాతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ దృఢస్వరంతో "ఇన్నిసార్లు ప్రశ్నిస్తూ ఇంతవాదం చేస్తున్నావేగాని నీవెవరవు? అనే ప్రశ్నకు బదులు చెప్పవే? ముందు నా ఈ ప్రశ్నకు బదులిచ్చి వెనక వాదించు. అప్పుడు నేను సమాధానమిస్తాను. ఈ వాదించే దెవరో ముందు చెప్పు" అని గట్టిగా అడిగారు. అతడందుకు ప్రత్యుత్తర మీయలేక వెళ్ళిపోయాడు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
ఆ వెనుక నేనాభావం తీసుకొని "దివ్యాస్త్రం" అనే పేరుతో అయిదు పద్యాలు వ్రాసి చూపితే భగవాన్ నవ్వుతూ "పూర్వం నాయన (గణపతి ముని) ఇక్కడున్నప్పుడు కపాలిన్నీ ఇక్కడే వుండేవారు. వారు నన్నేదైనా ప్రశ్నించాలంటే ముందు చేతులు జోడించి "స్వామీ స్వామీ! మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా వుంటే ఒక్క ప్రశ్న అడుగుతాను' అనేవారు. ప్రసంగం మధ్యలో 'అసలు నీవెవరవు' అని నా నోట వచ్చిందంటే 'అయిందీ' బ్రహ్మాస్త్రం ప్రయోగించారూ? ఇంకేం మాట్లాడేది?" అనేవారు. వారు బ్రహ్మాస్త్రమని అంటే మీరు 'దివ్యాస్త్రం' అన్నారన్నమాట" అని సెలవిచ్చారు. ఆ వెనుక నేను గూడా బ్రహ్మాస్త్రమనే వాడుతూ వచ్చాను. నిజంగా ఈ అస్త్రానికి లొంగని వారెవ్వరు?

తే. సకల వేదాంతసారంబు సంగ్రహించి
    యాత్మచిద్వహ్నిలో బుటం బమరబెట్టి
   ధ్యానమను సానబట్టిన "నే నెవండ?"
   ననుచు వెడలిన దివ్యాస్త్ర మగునుగాదే.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ