రమణాశ్రమ లేఖలు 27 భక్తి రుచి 21-1-1946
రమణాశ్రమ లేఖలు 27 భక్తి రుచి 21-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/10/27-21-1-1946.html
పేలాలలో అన్నం పొదువుకొని తినటం గురించి నిన్న వ్రాస్తుంటే మరొక సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఎచ్చమ్మగారి వంటలో కూరా నారా, సరిగా వుడకకపోవటం ఎప్పుడూ సహజంగా ఉండేదట. పదార్ధాల రుచికంటే భక్తిరుచే ఎక్కువగా పరిగణించే భగవానులకది గోచరింపకున్నా, కొందరికి రుచింపక కొంత కాలం క్రిందట వేకువజామున కూరలు తరగటంలో భాగస్తులుగా ఉండే వారొకరు భగవానులతో ప్రసంగవశంగా దీన్ని సూచిస్తే, విని "ఏమో మీకు బాగుండకుంటే మీరు తినకండి. నాకు బాగానే వుంటుంది, నేను తింటాను" అని అన్నారట భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/503137973835522/?app=fbl
మరొకసారి, ఆమె వూళ్ళో లేకనో ఒంట్లో సరిగా లేకనో వారం పదిరోజులు ఎవరిచేతనో అన్నం పంపిందట. వడ్డించే వారొకనాడు ఆ అన్నం సంగతి మరచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట. మామూలుగా భోజనానికి ఉపక్రమించండని సంజ్ఞ చేసి తాము కూడా తినుటకారంభించే భగవాన్ ఆనాడు ఎడమచెయ్యి చెక్కిట జేర్చి కుడిచెయ్యి విస్తట్లో పెట్టుకొని పలక్కుండా కూర్చున్నారట. తినండనే సంజ్ఞ గాని, తాముపక్రమించుట గాని కనపడక విస్తళ్ళ ముందున్న వారంతా ఒకరివంక ఒకరు చూడటం ప్రారంభించారు. వంటయింట్లో ఏమా ఏమా అన్న గుసగుసలు. అంతలో ఎచ్చమ్మ అన్నం వడ్డించలేదన్నమాట జ్ఞప్తికి వచ్చి, "అయ్యో మరచితి" మని వడ్డిస్తే యథాప్రకారం సంజ్ఞ చేసి తాము కూడా భుజించారట. ఏ బీద భక్తులు గానీ, భక్తితో తెచ్చిన పచ్చి వేరు శనగలైనా పంచభక్ష్యపరమాన్నాల కంటే ప్రీతితో కుచేలునిచేత అటుకులుతిన్న కృష్ణ మూర్తి వలె తినటం వారికి మామూలు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
T.me/BhagavanRaman
Comments
Post a Comment