రమణాశ్రమ లేఖలు 10 ఈతి బాధలు 30-11-1945
రమణాశ్రమ లేఖలు 10 ఈతి బాధలు 30-11-1945
http://bhagavanraman.blogspot.com/2018/09/telegram-t.html
ఆ మధ్య, సుమారు రెండేళ్ళు అవుతుందనుకుంటా, చాలాకాలం నుంచీ
వస్తూపోతూ ఉన్న వృద్దబ్రాహ్మణ దంపతులు, గుంటూరు వాస్తవ్యులు, కొండయ్య
అనేవారు ఇక్కడికి వచ్చి రెండు నెలలున్నారు. పాపం! ఆ బ్రాహ్మణుడు ఇల్లూ,
వాకిలీ, బిడ్డలూ మొదలైనవి వదలి నెలా, రెండు నెలలకంటే ఉండలేడు. కాని
నెపం భార్యమీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరకు వచ్చి “ఈ సంసార బాధలు
పడలేను స్వామీ. మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది. రెండు నెలలు
కాగానే ఇంటివద్ద ఏదో ఇబ్బంది. 'పోదాం రండి' అంటుంది. నీవు పో అంటే
పోదు. నేనెంత చెప్పినా వినదు. కాస్త మీరైనా చెప్పి పంపండి. నేను తమతో
పాటు ఇంత తిని ఇక్కడే పడివుంటాను” అన్నాడు.
https://www.facebook.com/359807631501891/posts/516799329136053/?app=fbl
శ్రీవారు వినోదంగా సంసారం విడిచి ఎక్కడికండీ పోయేదీ. ఆకాశంమీదికి
ఎగురుతామా ఏం. భూమిమీదే కదా ఉండేది. మనం ఎక్కడుంటే అక్కడే
సంసారం. నేనూ ఏమీ వద్దని వచ్చాను. చూడండీ, ఇప్పుడెంత సంసారమో!
మీ సంసారం కంటే నూరురెట్లు అధికంగా ఉంది. మీరు ఆమెని పొమ్మని
చెప్పమంటారు. ఆమె వచ్చి 'నేనెక్కడికి పోయేది స్వామీ, ఇక్కడే ఉంటా
నంటుంది. ఆమెకేం చెప్పేదీ? మీ సంసారం మీకు వద్దంటారు. నా యీ
సంసారం నేనేం చేసేదీ? ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేదీ?" అన్నారు
భగవాన్. హాల్లో అంతా నవ్వులు. "ఊ, భగవానులకేం, బంధరహితులు కనుక
ఎంత సంసారమన్నా భరిస్తారు” అంటూ చతికిలబడ్డాడా వృద్దు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
శ్రీవారి పరిహాసం చూచితీరాలి. సాధారణంగా వారు మాట్లాడేమాట ఏదైనా
బోధగానే ఉంటుంది. మావంటి భక్తులంతా ఎప్పుడూ కాలునొప్పనో,
కడుపునొప్పనో, వారికి నివేదించటం పరిపాటైంది. ఈ మధ్య ఒకరు వచ్చి
“నా కళ్లకు జబ్బు. సరిగా కనుపించడం లేదు. భగవాన్ అనుగ్రహించాలి.”
అంటే 'సరే' నన్నట్లు తలవూపి, వారటుపోగానే “వారు, కళ్ళకు జబ్బంటారు.
నా కాళ్ళకు జబ్బు, నేనెవరితో చెప్పుకునేదీ?” అన్నారు భగవాన్. అందరం
విస్తుబోయినట్లు ఊరుకున్నాం. భగవాన్ అల్లా అప్పుడప్పుడు అనటం కద్దు.
T.me/BhagavanRaman
Comments
Post a Comment