Talk 27
భాషణములు 27.
http://bhagavanraman.blogspot.com/2018/09/talk-27.html
భ: వానిని అభ్యసించేదెలా?
మ: బాహ్య విషయముల నశించే స్వభావమను (అశాశ్వత స్వభావము లేదా క్షణభంగుర స్వభావమును ) పరీక్షించుట అనే వివేకము వలన వైరాగ్యము కలుగుతుంది. కాబట్టి విచారము మనమెక్కవలసిన మొదటి మెట్టు.ఈ విచారము అప్రయత్నంగా సహజమైనపుడు ధన కీర్తి భోగ విలాసాదుల పట్ల తిరస్కార భావం కలుగుతుంది. నేను అన్న ఆలోచనల పట్ల పరీక్ష స్పష్టమవుతుంది. నేను యొక్క మూలము హృదయం . ఇదే గమ్యం . ఒకవేళ సాధకుడు తాత్కాలికంగా ఈ విచార మార్గం (విశ్లేషణ ద్వారా లోపలికి చూచుట అనే పద్ధతి) కు అనుకూలంగా లేకపోతే అతడు/ఆమె భక్తిని పెంచుకోవాలి. ఈ భక్తి ఒక ఆదర్శమునకై ఉండాలి. ఆ ఆదర్శం భగవంతుడు , గురువు , మానవజాతి , నైతికనియమాలో (ధర్మమో) లేదా ఒక సౌందర్య భావము పట్ల అయినా ఉండవచ్చు. వీటిలో ఏదో ఒకటి ఆ వ్యక్తిని ముంచెత్తినపుడు (ఆవేశించినఫుడు) ఇతర ఆసక్తులు సన్నగిల్లుతాయి. అంటే వైరాగ్యము (అసంగము) పెరుగుతుంది. ఆదర్శముయందు ప్రీతి పెరిగి చివరకు వేరే వాటికి తావీయదు. ఆ విధంగా ఏకాగ్రత తెలియకుండానే పెరుగుతుంది. ఇది దివ్య దృశ్య లేదా ప్రత్యక్ష సహాయములతోనో అవి లేకుండానే కూడా జరుగుతుంది.
విచారం, భక్తి ఈ రెండూ లేకపోతే సహజమైన శాంతి దాయకమైన ప్రాణాయామమును ప్రయత్నించవచ్ఛును. దీన్ని యోగ మార్గం అంటారు. ప్రాణానికి ముప్పు కల్గినప్పుడు ఆసక్తి అంతా ఆ ప్రాణ రక్షణలోనే కేంద్రీకృతమౌతుంది.శ్వాస బిగబట్టినపుడు మనసు తనకు నచ్చిన బాహ్య వస్తువులవైపు పరుగెత్తలేదు.పరిగెత్తదు.ఈ విధంగా శ్వాస నిలిచి ఉన్నంత వరుకు మనసుకు శాంతి. ధ్యాస అంతా శ్వాస, దాని నియమనం పైనే ఉంటుంది. మిగిలిన ఆసక్తులు పోతాయి. నియమనం లేని శ్వాసవలన భావోద్వేగాలు కలుగుతాయి. అదే మెల్లగా, క్రమంగా చేసే శ్వాస వలన శాంతి, ఆనందం కలుగుతాయి. ఆనందం ఉద్వేగం కూడా దుఃఖ ఉద్వేగం కూడా దుఃఖ ఉద్వేగం లాగే చాలా బాధ పెడుతుంది. ఈ రెంటిని కూడా శ్వాస సక్రమంగా ఉండదు .( సంక్షోభంతో ఉంటుంది) నిజమైన శాంతే సంతోషము. (ఆనందము) భోగవిలాసాలు ఆనందాన్ని కల్గించవు. రాతి పైననో చర్మం పైననో నూరిన కత్తివలె అభ్యాసం వలన మనసు సంస్కరించబడి నిశితమవుతుంది. అపుడు ఆ మనసు లోపలి మరియు బయటి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమర్దవంతమౌతుంది. స్వభావంగా భక్తి విచార పద్ధతులు కుదరక,పరిస్థితులవలన లేదా వయసు వలన మూడవ పద్ధతి అయిన (యోగ మార్గం) కూడా కుదరకపోతే ఆ కర్మ మార్గం ( సంఘసేవ లాంటి మంచి పనులు చేయుట)అవలంబించవచ్ఛు, ఆ వ్యక్తి లోని ఉదార స్వభావము వ్యక్తమవుట ఆరంభిస్తుంది . దాని వలన వానికి దేనితోనూ సంబంధము లేకుండానే ఆనందము కలుగుతుంది. వాని లోని అహంకారం సన్నగిల్లి మంచితనం, సాధుత్వము పెరిగే అవకాశముంది కలుగుతుంది. అప్పుడతనికి పైన చెప్పిన మూడు మార్గాల్లో ఏదో ఒకటి అనుసరించేందుకు అవకాసము కలుగుతుంది ఈ ఒక్క పధ్ధతితోనే వాని స్ఫురణ (intuition)కూడా కలగవచ్చు.
భ: ఒకే ఆలోచన సరళి చేత ఒకే ప్రశ్నను పదేపదే వేసుకోవడం వలనగాని ఆత్మ సమ్మోహనము ( self hynotism ) జరుగుతుందా ? విశ్లేషణకు వీలు కానిది, మౌళికమైనదీ అస్పష్టమైనది ,చేజిక్కనిదీ అయిన "నేను అను భావమును వివరించుటకు తగినట్టి ఉపాయము చూడవద్ధా ?
మ: నిజమే కనుగొనవచ్చు అది కళ్ళు మిరుమిట్లు గొలిపే స్పటికం లోనికో కాక ఏ శూన్యంలోనికో తేరిపార చూడటం వంటిదే.
భ: ఆ లక్ష్యము పై మనసును లగ్నము చేయగలమా ? అది ఎలా ?
మ: మనసు విక్షేపము పొందినచో 'ఈ విక్షేపము ఎవరికీ' అని ప్రశ్నించు. ఆ ప్రశ్న వెంటనే నిన్ను అహం (నేను అను) భావ స్థానమునకు తీసుకుపోతుంది.
భ: మనసు ఎంతకాలం హృదయమునందు ఉండగలదు లేక ఉంచబడగలదు?
మ: అభ్యాసము వలన ఆ కాలమును పొడిగించవచ్ఛు.
భ: ఆ అవధి ముగిసేక ఏమవుతుంది?
మ: మనసు తన మామూలు స్థితికి వస్తుంది, హృదయము నందలి ఏకత్వము యొక్క స్థానము నందు నానావిధములైన దృశ్య విషయములు చేరుతాయి . దానినే బహిర్ముఖమైన మనసు అంటారు. హృదయంగమమైన మనసను నిశ్బలమైన ప్రశాంత మనసు అంటారు.
భ: ఈ వ్యవహారమంతా బుద్ధికి సంబంధించినదా లేక అనుభవ ప్రధానమా?
మ: అనుభవమే..
భ: మనస్సు హృదయములో ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఆగుతాయి ?
మ: సంకల్ప బలం వలన, లేదా అలా అవుతుందని చెప్పే గురువు ఉపదేశంలో ప్రగాఢ విశ్వాసం వలన.
భ: ఈ పద్ధతి వలన కలిగే లాభం ఏమిటి?
మ: 1. సంకల్పం నెగ్గుతుంది _ ఏకాగ్రత పెరుగుతుంది.
2. మనోవికారాలపై విజయం _వైరాగ్యం పెరగడం.
3.ధర్మాచరణం పెరుగుతుంది. అందరి పట్ల సమత్వం.
భ: ఆలోచించలేని దాని గురించి ఆలోచిస్తూ వ్యక్తి తనను తాను సమ్మోహన పరచుకోవడం (self hypnotism) ఎందుకు చెయ్యాలి ? త్రాటకము (దీపమును చూడటం) , ప్రాణాయామం, సంగీత శ్రవణం, అనాహత శబ్దాలను వినడం, ప్రణవ (ఓంకారం) ధ్యానం లేదా వేరే జపం ధ్యానం లాంటి ఇతర పద్ధతులు ఎందుకు అవలంబించ కూడదు ?
మ: త్రాటకం ( వెలుగును అదే పనిగా చూడటం) వలన మనసు స్థబ్దమై తాత్కాలికంగా అపస్మారం కలగవచ్చు. దాని వలన శాశ్వతమైన ప్రయోజనం లేదు. ప్రాణాయామం కూడా సంకల్ప శక్తిని తాత్కాలికంగా జడం చేస్తుంది. సంగీత శ్రవణ ఫలితం కూడా అటువంటిదే. మంత్రము పావనమై దివ్యమైన శక్తి సహాయము వలన ఆలోచనలను శుద్ధము చేసి వాటిని ఉన్నతమైన వానిగా మారిస్తేనే మంత్రి ధ్యానం ఉపయోగ పడుతుంది. లేకుంటే దాని ఫలితం కూడా తాత్కాలికమే.
Telegram
T.me/BhagavanRaman
Comments
Post a Comment