Talk 26

భాషణములు 26.
http://bhagavanraman.blogspot.com/2018/09/talk-26.html
భ: మనసు యొక్క స్వభావము అనగా దాని  మూల కారణమును లేదా మనస్సు యొక్క పుట్టుకకు కారణమైన సత్యవస్తును కనుగొనుట ఎలా ?
మ: ప్రాముఖ్యతను బట్టి ఆలోచనలను ఒక క్రమంలో పెడితే నేను అన్న ఆలోచన అత్యంత ప్రధానమైనది. అహం'(నేను) ఆలోచన ఒక వ్యక్తి ఆలోచన గానే పుడుతుందిగాని అహంకారంతో సంబంధము లేకుండా ఉన్నట్లు కనపడదు. కనుక ఆలోచనలోనే వ్యవహారమంతా అహంకారం యొక్క పనియే.

   ఉత్తమ పురుష (నేను) లేకుండా ప్రధమ పురుష (వాడు )  మధ్యమ పురుష ( నీవు) లకు ఆస్కారము లేదు.' నేను' తోచకుండా' వాడు' 'నీవు' తోచరు.ఈ విధంగా మూడూ కలిసి పుడతాయి.కలిసి మాయమవుతాయి. కనుక ఇప్పుడు ఈ నేను లేక వ్యక్తిత్వం యొక్క మూల కారణాన్ని వెతుకు. దేహ ధారి అయిన వ్యక్తికే నేను అనే భావన పుడుతుంది. కనుక అది ఒక దేహముతోగానీ ప్రాణముతోగానీ సంబంధము కలదై ఉండాలి. దానికని శరీరంలో ఏదైనా ప్రత్యేకమైన స్థానం ఉందా?

వాక్కు, కామము మొదలైనవి మెదడుకు సంబంధించి ఉన్నట్లుగా, నేను భావన మెదడులో గానీ, రక్తంలో కానీ, ప్రేగులలో కానీ ఏ చోటికైనా సంబంధించి ఉన్నదా ? ఆలోచన_ ప్రాణములు మెదడుతో, వెన్నుముకతో ముడిపడి ఉన్నాయి. అక్కడి రక్త ప్రసారము వాటిికి కావలసిన ఆహార, వాయువులు తగు పాళ్లలో కలిసి నాడీ పదార్థం ( మజ్జ గా మారుతుంది. దీని తోనే మెదడు , వెన్నుపాము పుష్టిని పొందుతున్నాయి.ఈ విధంగా _ కణప్రసారము , ఊపిరి తీయుట, వదులుట,పోషణము మొదలగు వానితో సహా వృక్ష జీవితము లేక ప్రాణ శక్తి, జీవి యొక్క అంతర్భాగంగా లేదా సారముగా (లేదా వాని యందు ఉన్నదానిగా ) చెప్పబడుతుంది.. ఈ విధంగా మనసును ప్రాణ శక్తి యొక్క వ్యక్త రూపముగా భావించ వచ్చు. దానికి హృదయం స్థానం కాబట్టి మనసు జీవ శక్తి యొక్క రూపమని, అది హృదయం లో నివసిస్తోందని అనుకోవచ్చు.

భ: మనోనాశము , దాని స్థానంలో స్ఫురణ పెంపొందిచాలంటే ఆ రెండూ కూడా రెండు దశలా ? లేక ఆ రెంటి మధ్య మనసు కానిది స్ఫురణ కానిది ఏదైనా తటస్థమైన దశ ఉందా? లేదంటే మనోవ్యాపారము లేదు కాబట్టి అది ఆత్మ జ్ఞానము (ఆత్మ సాక్షాత్కారం) కు సంబంధించినదా ?

మ: సాధకునికి ఈ రెండూ భిన్న దశలే. నిద్ర, కోమా, మూర్ఛ, ఉన్మాదము మొదలైన వాటితో కూడిన తటస్థమైన దశ కూడా ఉంది. దీనిలో మనోవ్యాపారం ఉండదు. ఆత్మ  చైతన్యము ప్రవర్తించదు.

భ: ఆ మొదటి భాగాన్ని తీసుకుంటే ఏ విధంగా మనసును తొలగించడం వ్యవహారిక జ్ఞానాన్ని దాటడం?

మ: సహజంగానే మనసు చంచలం . దాన్ని ఈ చాంచల్యం నుండి తప్పించడం మొదటి మెట్టు. దానికి శాంతిని చేకూర్చు. విక్షేపాలనుండి తప్పించు. లోపలకు చూసేటట్లు దానికి శిక్షణ ఇవ్వు. దీనిని ఒక అలవాటుగా  ( స్వభావముగా) చెయ్యి. ఇది బయటి ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం వలన మరియు శాంతంగా ఉండడానికి కలిగే ఆటంకాలను నివారించడం వలన సాధ్యం.

భ: ఈ మనశ్చాంచల్యం మార్చేదెలా?

మ: మనసును కలత పెట్టేవి బాహ్య సంపర్కం. తనకంటే వేరైన విషయాలతో పొత్తు వలన మనసు చంచలమౌతుంది. అనాత్మయందు ఆసక్తి లేకపోవుట (వైరాగ్యము) మొదటి మెట్టు. తర్వాత వివేకము (అంతర్దుష్టి) ,ఆ తర్వాత ధ్యానము ( ఏకాగ్రత) క్రమంగా అలవాటు అవుతుంది. వాటి లక్షణాలు మనస్సు ఇంద్రియముల నిగ్రహము (శమము, దమము) వీధి ద్వారా సమాధి ( విక్షేపము లేని ఏకాగ్ర మనసు) కలుగుతుంది.

Telegram
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ