Talk 23

భాషణములు 23
http://bhagavanraman.blogspot.com/2018/09/talk-23.htm
2 ఫిబ్రవరి ,1935.

మరొకనాడు ఇవాన్ వెంట్స్ తన సంభాషణను ఇలా కొనసాగించాడు.

" ఒక వ్యక్తికి పలువురు ఆధ్యాత్మిక గురువులు ఉండవచ్ఛునా ? "

మ: గురువు ఎవరు? ఎన్ని చెప్పినా సరే చివరికి గురువు ఆత్మయే. మనసు యొక్క పరిణతిని బట్టి ఆత్మ బయట గురువుగా వ్యక్తమౌతుంది . పురాతనుడూ ప్రసిధ్ధుడు అయిన అవధూత యోగి (దత్తాత్రేయులు) తనకు ఇరవైనలుగురుకంటే ఎక్కువ గురువులు ఉన్నారని చెప్పారు. ఎవరి నుండి మనము ఏదైనా నేర్చుకొనగలమో అతడే గురువు. అవధూతకు (దత్తాత్రేయులు) ఉన్నట్లు ఒకప్పుడు జడము (అచేతనము) కూడా గురువు కావచ్చు.  ఈశ్వరుడు, గురువు ఆత్మ అన్నీ ఒక్కరే.

ముముక్షువు ( మోక్షము కోరేవాడు) ఈశ్వరుని (భగవంతుని) సర్వవ్యాపకునిగా భావించి, ఈశ్వరునే గురువుగా గ్రహిస్తాడు. కొంతకాలానికి భగవంతుడే వానికొక సశరీర గురువును సమకూరుస్తాడు. సాధకుడు ఆ మనుష్యుడు సర్వమయునిగా గ్రహిస్తాడు. చివరికి ఆ సాధకుడు గురువు అనుగ్రహం వలన తన ఆత్మయే  (అంటే తానే) సత్యవస్తువనీ , దానికి అన్యముగా ఏదీ లేదని తెలుసుకుంటాడు .

భ: భగవాన్ తన శిష్యులకు దీక్ష ఇస్తారా ?

భ: మహర్షి మౌనం వహించారు.

కొంతసేపటికి ఒక భక్తుడు సమాధానమిచ్చే బాధ్యతను వేసుకొని ఇలా జవాబు చెప్పాడు.
" మహర్షి ఎవ్వరినీ తనకు వెలుపల ఉన్నట్లు తలవరు. అందువలన ఆయనకు శిష్యులు లేరు. ఆయన అనుగ్రహము సర్వ వ్యపకము . కావున మౌనంగానే ఆయన యోగ్యుడైన ఏ వ్యక్తి పైనైనా తన అనుగ్రహం వర్షిస్తారు. "

భ: ఆత్మ జ్ఞానానికి శాస్త్ర అధ్యయనం ఎలా సహాయపడుతుంది?

మ: వ్యక్తిని ఆధ్యాత్మికత యందు ఆసక్తునిగా చేయునంతవరకే సహాయపడుతుంది .

భ: బుధ్ధి ఎంతవరకు సహాయపడుతుంది ?

మ: వ్యక్తి బుద్ధిని అహంకారం లోనూ, అహంకారం ఆత్మ లోనూ కలిపేవరకే సహాయపడుతుంది.

Telegram
T.Me/BhagavanRaman

2nd February, 1935
Talk 23.
Mr. Evans-Wentz continued another day: “May one have more than
one spiritual master?”
M.: Who is a Master? He is the Self after all. According to the stages
of the development of the mind the Self manifests as the Master
externally. The famous ancient saint Avadhuta said that he had
more than 24 Masters. The Master is one from whom one learns
anything. The Guru may be sometimes inanimate also, as in the
case of Avadhuta. God, Guru and the Self are identical.
A spiritual-minded man thinks that God is all-pervading and takes
God for his Guru. Later, God brings him in contact with a personal
Guru and the man recognises him as all in all. Lastly the same man
is made by the grace of the Master to feel that his Self is the
Reality and nothing else. Thus he finds that the Self is the Master.
D.: Does Sri Bhagavan initiate his disciples?
Maharshi kept silent.
Thereafter one of the devotees took it upon himself to answer,
saying, “Maharshi does not see anyone as outside his Self. So
there are no disciples for him. His Grace is all-pervading and He
communicates his Grace to any deserving individual in silence.”
D.: How does book-lore help in Self-Realisation?
A.: Only so far as to make one spiritually-minded.
D.: How far does intellect help?
A.: Only so far as to make one sink the intellect in the ego, and the
ego in the Self.

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ