రమణాశ్రమం లేఖలు 7 నిక్షేపం 27-11-450

రమణాశ్రమం లేఖలు 7 నిక్షేపం 27-11-45
http://bhagavanraman.blogspot.com/2018/09/7-27-11-450.html
       నిన్నటి జాబంతా నేడు విప్పిచూచాను. స్కందాశ్రమ గమనం చాలా
ఆనందంగానే ఉందికాని, బాగా ఆలోచిస్తే ఒక సంగతి జ్ఞాపకం వస్తున్నది.
ఏమంటే
https://www.facebook.com/359807631501891/posts/518923512256968/?app=fbl
కడుపాకలిం దీర్చి కడ ద్రోయునమ్మా
కడతేరు మార్గంబు గననీయడమ్మా
అంటియు న్నంటక అలరు నోయమ్మా
అట్టిమార్గము జూపి అరయ రాడమ్మా!!

    అని విన్నకోట వెంకటరత్నం ఒక పాటలో రాసాడు. ఆ మాట నిజమైందని
తోస్తున్నది. స్కందాశ్రమంలో ఉన్నంత సేపూ, ఏవో ఆ కబుర్లు యీ కబుర్లు
చెప్పి కడుపునిండా భోజనం పెట్టి కదలి పొండన్నారు. చూచావా? దీనికే మైమరచి
ఉబ్బితబ్బిబ్బెతున్నాం. అసలు ధనం, ఆ అమృతమైన నిక్షేపం ఆ అరుణాచలంలో
ఎక్కడో దాచి పెట్టారన్నా! ఆ నిధిని వెతకి కనుక్కోకుండా పులిహోర, పెరుగన్నం
పెట్టి మత్తుచల్లినట్లు మరపించారు సుమా. ఒకళ్ళయినా నోరెత్తి ఆ మాట
అడగలా, అయితే లోపం మాదేలే. “ఇది కాదయ్యా మా కీయవలసింది. ఏక
రసమగు ఓగిరం వేరే ఉంది. అది కావా” లని అడిగితేగా. అడగనిదే అమ్మయినా
పెట్టదంటారు. ఏదో కావాలి కావాలని సణగటమే గాని, బాగా ఆకలై ఆర్తితో
అడిగితే ఆ అమృతమయమైన విజ్ఞానాహారం ఆరగింపు చేయడా అందరికీ?
కరుణాపూర్ణ సుధాబ్ది కదా? అడగటం చేతకాలా నాకు. వారిదేం పోయిందీ!
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
      సొంత యింట్లోలాగా అరుణాచలంలో తమ నిక్షేపం గుప్తంగా దాచుకున్నారు. ఎంత చిత్రమనుకున్నావు మహాత్ముల లీలలు! సదా కిటికీలలో నుండి చూచుకుంటూనే ఉంటారా నిక్షేపాన్ని. కనురెప్పపాటు కాలమైనా మరువరు సుమా, నాలాంటి వాళ్ళకి ఆ నిక్షేపాన్ని కనిపెట్టుట సాధ్యమా? అర్హత సంబందించుకుంటే ఎప్పటికైనా వారే యిస్తారేమో? అదే సంపాదించాలి మనం. పాత్ర ఎరిగి దానం, క్షేత్రం మెరిగి విత్తనం అన్నారు పెద్దలు. ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని పందలేకుండా ఉన్నాం. ఎందువల్ల? అర్హత సంపాదించనందువల్ల ఏమంటావు ? నిజమేనా ?
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ