రమణాశ్రమ లేఖలు 6 యోగ సామ్రాట్ కొలువు 26-11-45

రమణాశ్రమ లేఖలు 6 యోగ సామ్రాట్ కొలువు 26-11-45
http://bhagavanraman.blogspot.com/2018/09/6-26-11-45.html
      నేటి ఉషఃకాల వేద పారాయణ వినటానికి నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబిడగా ఉన్నారు. వండేవారు , వార్చేవారు పురమాయించేవారు పాకశాల అంతా పలువిధ సంభారాలతో నిండి చిత్రశాలగా ఉంది. పులిహోర, దధ్యోదనం, చక్కెరపొంగలి, ఉప్పు పొంగలి, వడలు, వరుగులు, పూరీ, కూటు  ఇంకా ఎన్నెన్నో గంపలకెత్తను, కొండకు పంపను సరిపోతున్నది. సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రి అంతా నిద్ర పోయినట్లే లేదు. శ్రమ అంతా వారిదే సుమా.
https://www.facebook.com/359807631501891/posts/519623788853607/?app=fbl
   పూర్వం శ్రీ కృష్ణుడు గొల్లలు ఏటేటా చేసే ఇంద్ర యాగం మానిపించి గోవర్దన గిరికే పూజానైవేద్యాలర్పింప నియోగించాడట. ఈ కొండకెక్కే గంపలు చూస్తే కార్తీక వనసమారాధనలో చేసే పూజ ఉసిరికకు బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్లు అనిపించింది. వేద పారాయణం అనంతరం భగవాన్ స్నానం ఫలహారం ముగించుకుని నందికి సరివచ్ఛు రంగసామి వెంటరాగా శివునివలె కదిలి ఉదయార్క  కిరణములు బారులు సాగి దారి చూప అరుణ గిరి నారోహించి సొంత ఇంటికి వెళ్ళినట్లుగా స్కందాశ్రమానికి వెళ్ళారు.

       శ్రీవారికి ఒత్తిడి కాకుండా సుంత నిదానించి , ఆవల గుంపులు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు. శ్రీవారి సోదరి అలిమేలు అత్తా, నేనూ మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి భగవాన్ భ్యక్తులచే పరివేష్టింపబడి ,కట్టడం ముందు చెట్ల నీడన సుఖాసీనులై ఉన్నారు. ఆహా ! ఋష్యాశ్రమం  అంటే ఇది కదా , అనిపించింది. హలో వంశంలో చెప్పినట్లు సంయమీశ్వరులిచ్ఛు సంధ్యార్ఙఘ్యజల బిందుజాలములు ,ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచరం కాకున్నా సెలయేటి తుంపరలే సంధ్యార్ఘ్యజల బిందువులుగా ,కలకలారావం చేసే పక్షులకూజితాలే సామగానంగా బదరికాశ్రమం వలెనే స్కందాశ్రమం కనువిందు కావించింది.ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుంచి , మద్రాసు నుంచి ,విల్లుపురం నుంచి ఇంకా ఎక్కడెక్కడ నుంచో లాయర్లు , డాక్టర్లు, ఇంజనీర్లు, చిత్ర లేఖకులు ,పత్రికా విలేఖరులు కవులూ గాయకులు ఎందరెందరో వచ్చారు. స్త్రీలు బాలురు, వృద్ధులు, వీరు వారననేల అందరు హెచ్చు తగ్గులను విచారింపక నేలపై అనువదించి ఆశీనులై స్వామిని పరివేష్టించి అనిమిషలోచనులై శ్రీవారి నవలోకిస్తూ కూర్చున్నారు.  అనేక ధాతు సముదాయంతో  కూడిన అరుణాచలమే రత్నసింహాసనంగా ఆకాశవీధి నావరించిన మేఘమే శ్వేతఛ్ఛత్రంగా. అట విస్తరించిన బహుశాఖా సమన్విత వృక్ష సముదాయమే వింజామరలుగా మహా సామ్రాజ్యాభిషిక్తుని వలె వున్న ఆ యోగసామ్రాట్ కు  ప్రకృతి కాంత నీరెండచే నివాళులిచ్ఛింది.

     అన్నా ఆ దృశ్యం ఏమని రాయగలను ? ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విలోకముల కాంతి దశదిశలా ఆవరించింది. ఆ మందహాసం శరచ్ఛంద్రికలు విరజిమ్మింది. ఆ వాక్కు అమృతం వర్షించింది. అట్లే మైమరచి కొంతసేపు  కూర్చున్నాం.ఫోటోగ్రాఫర్లు వారి పని వారు చూసు కున్నారు. తొమ్మిదిన్నర తరువాత యధాప్రకారం మళ్ళీ మహారాజదర్బారులా పోష్టు, పేపర్లు వగైరా కార్యక్రమమంతా కింద ఆశ్రమంలో వలెనే నడిచింది. ఆ తరువాత మబ్బులధికమై గాలి విసరడంచేత శిష్యులు ఒక తెల్లని శాలువా కప్పుకోవడానికి ఇచ్చారు. ముఖం మాత్రం కనపడేలా తల,వళ్ళు అంతా కప్పుకుని భగవాన్ కూర్చుంటే  మా అవ్వ అళగమ్మ  అపర రూపమా అన్నట్లు తోచింది ,అత్తా నేనూ ఆ మాటే అనుకున్నాం. ఆ దృశ్యం కూడా ఫోటో తీసారు. మరి కొంతసేపు  శ్రీ వారు ' గురోస్తు మౌనం వ్యాఖ్యానం' అన్నట్లు మౌనబోధ చేసారు.'ఛిన్న సంశయాః'  కావడానికి తగిన పుణ్యాత్ములుందురులే. భక్త  సహోదరులు స్వామికి  విడిగా భోజనం పెట్టాలని చూసారు కానీ ఆయన ఒప్పుకుంటారా ? తమ ఆసనం దగ్గిరే టేబుల్ వేయించుకుని అందరితో పాటు విందారగించారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
    భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న ముందరి వసారా  కట్టడంలోకి ఆసనం మార్చారు. పది నిముషాలు కొంచెం దూరంగా ఉన్నా క్రమంగా అంతా చుట్టూ చేరారు. అమ్మ వచ్చిన సమాచారం ,స్కందాశ్రమం నిర్మాణం, నీటి వసతి ,వంట సామాగ్రి రావటం , కోతుల రాజ్యం , నెమళ్ళు నృత్యం, పాముల చెలిమి ,చిరుతల కలిమి ,ఇత్యాది తమ గిరి జీవితం వినోద కధలుగా భగవాన్ చెపుతూఉంటే శ్రీ వారి పాదాల కెదురుగా ఉన్న కిటికీలోంచి చూస్తూ ప్రక్కనున్న చిన్న గది అత్తా నేనూ మరి కొందరితో స్త్రీలతో కూర్చున్నాం . ఆ ప్రసంగం సమయంలో నూతనాగతులగు నాగనార్యకవి శ్రీ వారి దృష్టి గోచరులగుటచే 'ఎప్పుడు వచ్చార'ని  వారిని ప్రశ్మించి, నావంక చూచి 'అదుగో వారు వచ్ఛార'ని చెప్పేరు భగవాన్. 'చూచా' అన్నాను. ఆ వెంటనే ఏదో స్పురించినట్లు తేజస్సహితమైన దృష్టిని ఇటు ప్రసరింపజేసి అక్కడే అమ్మ నిర్యాణమైనది.ఆ బైటనే ఆమెను కూర్చోబెట్టాము. అప్పటికి ఆమె ముఖంలో మరణ చిహ్నం. కానరాలేదు. సమాధిస్థవలే దివ్య తేజస్సు తాండవ మాడుతూ ఉన్నది . అక్కడే , మీదున్న చోటనే' అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వలే నా చెవులలో ధ్వనించింది. కనదగిన చోట నిలిచి వినదగిన మాట వింటిని.నేడెంత సుదినం !

   కపిలుడు దేవహూతికి తత్వోపదేశ మొనర్చి తరింపచేశమసాడు.ధృవుడు సునీతుని మోక్షపథ గామినిగా చేసాడు. శంకరులు తమ జననికి శక్తిలోక పదప్రాప్తిని అనుగ్రహించారు.  శ్రీ రమణులు మాతృదేవతకు అక్షయమోక్ష సామ్రాజ్య మిచ్ఛుటే గాక గౌరవచిహ్నంగా ఆమె సమాధిపై శ్రీ మాతృభూతేశ్వర లింగమును ప్రతిష్టింపజేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా ఒనర్చారు.

    అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్ళు నీరు గ్రమ్మినవి. అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్న మాట. నా తండ్రికెంత దయో మహాత్ములెప్పుడూ  అబలలను ఆదరిస్తారు. వారి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిణి ప్రేమమయి . అమ్మ రాక ముందు ఆశ్రమంలో వంటయే లేదట. అమ్మ వచ్చి భక్తులందరకు సుష్టుగా భోజనం పెట్టింది. ఆమె స్థాపించిన అగ్ని హోత్రుడే నేడు ఆశ్రమంలో పచనకార్యం  (వంట) నెరవేరుస్తూ వేల కొలది భక్తుల కుక్షి నింపుతున్నాడు.

   పూజ్యురాలగు ఆ తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమోనని వెనుదిరిగి చూచి లేకుండుట చూసి కొంచెం విచారించి  'స్త్రీ జాతికి వన్నెదెచ్ఛిన మాతా , మేము ధన్యులమని మనసు నందే నమస్కరించితిని. ఇంతలో రకరకాల ఫలహారాలు వచ్ఛినవి. అవి తిన్న అరగంట కల్లా పూరీ ,కూటు, సాయంత్రం నాలుగు దాటింది. పూరీ కూటూ తిని దారి పట్టాము . ఒకరి వెనుక నొకరుగా అందరను సాగనంపి అనుచర సమేతంగా అరుణ కిరణుడు అపరగిరికి చేరే  సమయానికి అరుణగిరి సింహపీఠావతరణం చేసి అల్లనల్లన భగవానులు ఆశ్రమం చేరుకున్నారు. యధా ప్రకారం వేద పారాయణాది  కార్యాలు నిర్వర్తింపబడినది.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ