రమణాశ్రమ లేఖలు 5 స్కందాశ్రమ గమనం 25.11.45
రమణాశ్రమ లేఖలు 5 స్కందాశ్రమ గమనం 25.11.45
Http://bhagavanraman.blogspot.com/2018/09/5-251145.html
https://www.facebook.com/359807631501891/posts/520220932127226/?app=fbl
స్కందాశ్రమంలో విందారగిచే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళటానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే. అందువల్ల నేడు ఆశ్రమవాసులగు సోదర సోదరీమణులందరు ప్రయాణ సన్నాహంతో హడావుడిగా ఉన్నారు. భగవాన్ మాత్రం ఏ తొందరా లేకుండా గంభీరంగా కూర్చున్నారు. అంతా కలిసి కదలమంటే ఈ కదలవచ్చు. వద్దంటే మానవచ్ఛు . వారికేం మూట కట్టాలా ముల్లె కట్టాలా ? కమండలం , కఱ్ఱ,కౌపీనం ,పైతుండు _ ఇవే పరికరాలు. తలుచుకున్న మాత్రాన తయారవుతారు. " కౌపీనవంతః ఖలు భాగ్యవంతః" అని ఆచార్య శంకరులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే. ఈ ఆశ్రమం ఈ కార్యక్రమం, ఈ భక్తులు ,ఈ బాదరబందీ అంతా పరులకొరకు నటనా మాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి నిజంగా? కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉన్నారేకానీ లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటి పోలేరా స్వేఛ్చగా ? ఇలా ఉండటం మన భాగ్యం సుమా! రేపటి సమాచారం రాస్తాలే. నీవు రావన్న మాటేనా?
T.me/BhagavanRaman
Comments
Post a Comment