రమణాశ్రమ లేఖలు 4 పెళ్ళి ముచ్చట్లు 2.11.45

రమణాశ్రమ లేఖలు  4 పెళ్ళి ముచ్చట్లు 2.11.45
http://bhagavanraman.blogspot.com/2018/09/4-21145.html
     భగవంతులు 'అప్పకు అమ్మకు కల్యాణం ' అని అంటూ ఉంటారని నిన్న రాసాను. అదే కాదు గృహస్తు భక్తులంతా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి నూతన దంపతులు చేత నమస్కారం చేయిస్తే మందహాసవదనంతో కృపావీక్షణములతోనే వారి నాశీర్వదించి ఆ పెళ్ళి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు. అప్పటి వారి ముఖ వైఖరి చూస్తే చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు చూచి మన పెద్దలు ఆనందించి నట్లే ఉంటుంది.
https://www.facebook.com/359807631501891/posts/520941708721815/?app=fbl
   ఆమధ్య ప్రభావతి పెళ్ళి అయింది. ఆమె దేవాస్ (సీనియర్ ) సంస్థానాధీశుల కుమార్తె . సంవత్సరం దాటిందనుకుంటా. పెళ్ళికి పూర్వం రెండేళ్ళ నుంచీ ఇక్కడే ఉంటుంది. ఆమె మహారాష్ట్ర యువతి, రూపవతి, విద్యావతి. తానూ భక్తి లో మీరాబాయిలా ఉండాలని ఆడుతూ, పాడుతూ, పెళ్ళి వద్దని , కాషాయం కడతానని, శ్రీవారి వద్ద ఏదేదో మారాం చేస్తూ ఉండేది. భగవానుడు తెలుసు పెళ్ళయితే కానీ ఈ చిలిపితనం వదలదని, చివరికెలాగో  పెళ్లయింది. వెంటనే బంధు సహితంగా వధూవరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి ఫలపుష్పాలిచ్ఛి భగవంతులకు నమస్కరించారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
   రెండు మూడు నాళ్ళిక్కడుండి, అత్తవారింటికి కొత్త కాపురానికి అనుమతి పొంది పోవాలని భర్తతో సహా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చింది. భగవాన్ సోఫా మీద ఉడుతలు పాకు తున్నాయి. హాలు వెలుపల నెమళ్ళు తిరుగు తున్నాయి. ఎక్కువ జనం లేరు. ప్రశాంతంగా ఉంది హాల్లో. భయభక్తులతో నమస్కరించి పోయి వస్తానని చెప్పి వాకిట్లో ఒదిగి నుంచున్నాడు ఆ యువకుడు. క్రింది చూపులు సిగ్గు దొంతరలు కాగా అశ్రుపూరిత లోచనయై అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడువలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది. సెలవు చిహ్నంగా తలఊపిన భగవానులను చూచి ప్రణమిల్లి  ఆ బిడ్డ గడప దాటగానే నాతో " భాగవతం లోని కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యరు చేత నిన్ననే రాయించుకుంది " అన్నారు భగవాన్. " ఈసారి వచ్చేప్పుడు బిడ్డ నెత్తుకుని రాగలదు. ". అన్నా నేను సంతోషంతో. ఇందులో ఆమె హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణారసపూరితంగా పాడనారంభించింది. భగవాన్ పులికితులై  'వింటివా ముకుంద మాలా స్తవం' అన్నారు. సాక్షాత్తు కణ్వమహర్షి వలె గద్గద కంఠంతో. నా కళ్ళు నీళ్ళతో నిండినవి. బయటకు వచ్చి పునః పునః  ప్రణామం చేసే ఆమెను ఆశీర్వాద పూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను. అప్పుడు పురాణాల్లో చదివిన గాధలన్నీ ప్రత్యక్ష గోచరం అవుతున్నవి అని నీకు రాద్ధామనుకున్నాను ‌. అతిశయోక్తిగా భావిస్తావేమో.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ