రమణాశ్రమ లేఖలు 26 చికిత్సలేని వైద్యం 24-1-1946

రమణాశ్రమ లేఖలు 26 చికిత్సలేని వైద్యం 24-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/09/26-24-1-1946.html
      భగవానులకు కాళ్లనొప్పులు తగ్గటానికి విటమిన్సుగల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహావల్ల ఆహారపదార్ధాలలో ఏదేదో మార్పిడి చేసి అప్పుడప్పుడు తైలం రుద్దీ, కాళ్లు ఒత్తీ తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ ఛలోక్తిగా “ఇంటికి చుట్టం వస్తాడు. చూచి చూడనట్లుంటే త్వరగా వెడతాడుకాని మర్యాద చేస్తే వెళ్లనే వెళ్లడు. వ్యాధికూడా అంతే. మీరలా ఉపచరిస్తే అదెందుకు పోతుందీ? లక్ష్యపెట్టకుంటే, తానే పోతుంది” అంటూ ఉంటారు.
https://www.facebook.com/359807631501891/posts/503700280445958/?app=fbl
     ఆ మధ్య విభూతి ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున ఒక మైలు దూరంలో మకాం వేసాడు జనానికి వేలంవెర్రి కదూ. ఆ విభూతిస్వామిని చూడాలని నేల యీనినటు వ్యాధిగ్రస్తులూ, దయ్యాలు పట్టినవారూ, భూతాలు పట్టినవారూ, అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికిన్నీ వచ్చేవారు. ఇక్కడేవన్నా విభూతులా? రక్ష రేకులా? దర్శనం చేసుకొని హాలు చుట్టూ తిరిగి పోయేవాళ్లు. ఆ సమయంలో సేవకులెవరన్నా కాళ్లకు తైలం రుద్దటానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ “భేష్! ఇదీ ఒకందుకు మేలే! ఈ జనమంతా నన్ను చూచి ఈ సామి తానే కాళ్ళనొప్పులతో బాధపడుతూ, ఇతరులచేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా' అని దగ్గరకు రాకుండానే పోతారు. మంచి ఉపాయం” అనేవారు. నాల్గురోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావటం వల్లనో, విటమిన్ ఇంజెక్షన్ వల్లనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్. మర్నాడు మరొక పేపర్లో వచ్చింది. మళ్ళీ చూపి “రెండేళ్ళనుంచీ నాకు విటమిన్ ఆహారమంటూ ఏమేమో చేస్తున్నారు. అదిచాలక ఇంజెక్షన్లు గూడా ఇవ్వాలని చూచారు. ఇది చూడండి ఏమయిందో' అని చిన్న పిల్లాడల్లే అనటం ప్రారంభించారు. “బాలుని గతిని ఉన్నత్తుని భంగిని పరమయోగి యానందించున్” అన్నట్లు తాము సర్వజ్ఞులయ్యు తెలియని వారివలె ప్రవర్తిస్తారు. తలచుకుంటే ఒక్క క్షణంలో అన్ని వ్యాధులూ, నివృత్తి చేయలేరా, చేసుకోలేరా? ఎవరో చూచుకుంటారు లెమ్మని వదిలివేస్తారు దేహం నాది అని లేనందున.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
      రెండు మూడేళ్ళకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు అన్నమంటే అసహ్యం తోచింది. దాదాపు ఒక వారం, పది రోజులు వరిపేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు. ఎచ్చమ్మగారు, మొదలియారుపాటి, భగవానులకు అన్నం పెట్టందే తాము తినం అని వ్రతం పట్టటంవల్ల వారి ప్రతభంగానికి సహించక ఆమె అన్నంలో నాల్గు మెతుకులు, ఈమె దాన్లో నాల్గు మెతుకులు పెట్టించుకుని ఆ పేలాలలో పొదువుకొని ఎల్లాగో మింగేవారు. ఎట్టి సమయం లోనూ ఇతరులను చిన్నబుచ్చనొల్లని ఆ కరుణకు మేరలేదు కదా! మన ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులెందరో మందులిచ్చారు. భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులూ తినేవారు, వీరి సంతృప్తికి ఈ అన్నమూ తినేవారు. దాని మేలు, దీని కీడు వారి నంటలేదు. నెలలు గడిచాయి. మద్రాసు నుంచి పెద్ద డాక్టరును రప్పించారు. ఫలితం మామూలే. అందరినీ రానిచ్చి, అన్ని మందులు కానిచ్చి, చిట్టచివరకు తామే శొంఠి, పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకొన్నారా కామెర్లను. 'ఎల్లా పోయిందని ఇప్పుడెవరన్నా అడగండి చూద్దాం.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ