రమణాశ్రమ లేఖలు 25 చిరుతపులి పిల్లలు 18-1-1946)
రమణాశ్రమ లేఖలు 25 చిరుతపులి పిల్లలు 18-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/09/25-18-1-1946.html
దాదాపొక సంవత్సరానికి ముందు ఎవరో చిరుతపులి పిల్లలను రెంటిని పెంచుతూ భగవత్సన్నిధికి తెచ్చారొకనాడు. వాటికి పాలే ఆహారంగా ఇచ్చి లాలిస్తే హాలులో వారందరితో పాటు కలసిమెలసి తిరగటమే గాకుండా భగవంతుల సోఫామీది కెక్కి,వారి ఆదరం పొంది, ఆ సోఫాపైనే పడుకొని సుఖంగా నిద్రపోయినవి. ఈ దృశ్యం ఆశ్రమంలో భక్తులొకరు ఫోటో తీశారు. మధ్యాహ్నం ఒక గంట మొదలు సాయంత్రం మూడింటి వరకూ వాటిని అట్లాగే సోఫాపైన వుంచుకొని భగవానులు ఒదిగి కూర్చున్నారు. అవతల అవి లేచి అటూ ఇటూ తిరుగుతూ నాలుగింటివరకూ వున్నవి. మరొకసారి ఆ పులి పిల్లలను సోఫామీద వుంచి, భగవాన్ కొండకు వెళ్ళేప్పుడు వారి ముందు టేబిల్ మీద కూర్చోబెట్టి ఫోటో తీశారు. సండే టైమ్సులో ప్రకటించారు కూడా.
https://www.facebook.com/359807631501891/posts/504363077046345/?app=fbl
చిత్రమేమంటే, ఆ పులి పిల్లలకు గూడా శ్రీవారి హస్తస్పర్శ వల్ల ఒళ్ళు తెలియని నిద్రవచ్చి సోఫామీదే హాయిగా పడుకున్నవి. అవి ఉండగానే ఉడుతలు వచ్చి పప్పులూ, పిచ్చుకలు వచ్చి బియ్యపు నూక తిన్నవి. పూర్వ జాతి వైషమ్యం లేకుండా తిరిగే జంతు సముదాయం చూచి 'ఇది ఋష్యాశ్రామం కాబోలు' ననుకుండేవారట. అవి పురాణగాథలు, ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాము. నిన్న పావురాల కథ,గోపూజ, నేను చదువగా విని "ఇట్లాంటి సంభవాలెన్నో జరిగినవి. లోగడ వ్రాసిందెవరు?" అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
ఈ పుస్తకం ప్రధమ ముద్రణమయి రాగానే భగవాన్ సన్నిధిలో చదివితే పై విషయం విన్న భక్తులొకరు శ్రీవారి నుద్దేశించి "పచ్చేయమ్మన్ కోవెలలో వుండగా పెద్ద పులి వస్తే ఎవరో భయపడి పరుగెత్తారట గదా?" అన్నారు. భగవాన్ అందుకొని "అవునవును. అక్కడ వుండగా రంగసామయ్యంగారు వస్తూ పోతూ వుండేవారు. వారొకనాడు బహిర్దేశానికి వెడితే అక్కడ ఒక పొదలో పులి కనిపించిందట. అదిలించబోతే గుర్రుమన్నది. ఆరికి ఒళ్ళు కంపమెత్తి కూర్చున్నవారు కూర్చున్నట్లే లేచి 'ఓ,భగవానే,రమణా రమణా' అని అరుస్తూ పరుగెత్తి రొప్పుతూ వస్తుంటే నేనెందుకో బయటకి వెడుతూ ఎదురైనాను. ఏమండీ 'ఈ హడావుడి?' అంటే 'అయ్యో పులి పులి. రండి స్వామీ, గుళ్ళో దూరి తలుపులు మూసుకుందాం. లోపలి వస్తుంది. రారేం' అంటూ నానా హంగామా చేశారు. నేను నవ్వుతూ 'ఉండండయ్యా ఏదీ పులి. ఎక్కడా లేదే?' అన్నాను. 'అదుగో ఆ పొదలో వున్నది' అని అటువైపు చూపారు. నేచూస్తానుండండని వెళ్ళి చూస్తే పులి లేదు. అయినా వీరికి భయం తీరలేదు.అది సాధు జంతువయ్యా భయం లేదంటే నమ్మరు. అట్లా ఉండగానే ఇంకొకనాడు నేనా కోవెలకెదురుగా ఉన్న కోనేటి గట్టున కూర్చొని వుండగా ఆ పులి వచ్చి నీరు త్రాగి నిర్భయంగా అనను చూస్తూ అటూ ఇటూ తిరిగి తన త్రోవన తాను పోయింది. అయ్యంగారు మాత్రం గుళ్లోదూరి ఇదంతా చూచారు. నేనేమవుతానో అని వారికి భయం. ఆ పులి వెళ్ళిన వెనుక నేను గుళ్ళోకి వెళ్లి 'చూచారా అదెంత సాధు జంతువో, మనం బెదిరిస్తే పైకి వస్తుందిగాని లేకుంటే రాదు' అని వారి భయం తీర్చాను. మేము ఆ వెనుక అక్కడ ఎక్కువ రోజులు ఉండనూ లేదు" అన్నారు భగవాన్.
T.me/BhagavanRaman
Comments
Post a Comment