రమణాశ్రమ లేఖలు 24 జంట పావురాలు 17-1-1946

రమణాశ్రమ లేఖలు 24 జంట పావురాలు 17-1-1946
Http://bhagavanraman.blogspot.com/2018/09/24-17-1-1946.html
1945 సెప్టెంబర్ లోనో అక్టోబర్ లోనో ఒక ఉదయం బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చిన వెంకటసామి నాయుడు అనే ఒక భక్తుడు రెండు పావురాలు తెచ్చి ఆశ్రమంలో అర్పించాడు. భగవానులది కని "సరిసరి, పిల్లులు మొదలగునవి బాధించకుండా కాపాడాలి గదా! వాటి కెవరు పోషణ చేస్తారు? పంజరం కావాలి; ఆహారం పెట్టాలి. ఇదంతా ఎవరు చేస్తారిక్కడ? వారే తీసుకుపోవటం మంచిది" అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/504984310317555/?app=fbl
కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తామనీ ఆశ్రమంలోనే వాటిని వుంచవలసిందనీ చెప్పి వారా జంట పావురాలను తెచ్చి స్వామి ఒడిలో పెట్టారు. భగవంతులత్యంత వాత్సల్యపూరితులై వాటిని చేరదీసి 'రండమ్మా రండి. పోరా మీరు! ఇక్కడే ఉండిపోతారా? ఉండండమ్మా ఉండండి; పంజరం వస్తుంది" అని చేతితో నిమురుతూ ఆదరంతో ఆ రెంటినీ లాలించేసరికి అవి కదలక మెదలక సమాధిస్థులవలె నిమీలిత నేత్రాలతో అట్లాగే నిలిచిపోయినవి. భగవానులున్నూ వాటిని ఒడిలోనే ఉంచుకొని నిమరటం చాలించి నిశ్చల సమాధినిస్టూలై ఆ జంట పావురాలను కృపాద్రుక్కుల నవలోకిస్తూ పలక్కుండా కూర్చున్నారు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
ఆశ్రమంలో వున్న భక్తులు పంజరం ఎక్కడున్నది వెదకి తెచ్చేసరికి దాదాపు ఒక గంట పట్టింది. చిత్రమేమంటే, ఈ గంట సేపూ ఆ పావురాలు కదలక మెదలక భగవాన్ ఒడిలో సమాధిస్తులగు యోగిద్వయమో అన్నట్లు కూర్చున్నవి. వాటి భాగ్యం ఏమని చెప్పాలి! ఆ మహామహుడు తన అంకపీటమందు ఉంచుకొని లాలించి, హస్తదీక్షయా అన్నట్లు శిరస్సు మొదలు చిరుపాదం వరకు చేతితో నిమిరి, చలనరహితమైన ఆనందానుభూతి నందజేశారంటే తొలినోము ఫలంగాక మరేమనాలి? అదే గాదు సుమా. పంజరం వచ్చిన వెనుక ఆ పావురాలను చేతితో నిమురుతూ బుజ్జగించి "పొండమ్మా,పొండి. పంజరంలో భద్రంగా ఉండం" డని చెప్పి పంపి "భాగవతంలో అవధూత యదుసంవాద ఘట్టంలో చెప్పిన గురుపరంపరలో పావురాలున్నూ ఒకటి" అని చెప్పారు భగవాన్. ఎప్పుడో ఆ కథ చదివిన జ్ఞప్తి వున్నది.

ఆ పావురాలు ఒళ్లో ఉండగానే ఒక భక్తుడు వచ్చి "ఇదేమి?" అని అడిగితే "ఏమో? వచ్చారు వారు.పొరట. ఇక్కడే వుంటారట. ఉన్న సంసారం చాలక ఇదొకటి వచ్చింది" అన్నారు భగవాన్ బంధరహితమైన బాధ్యత వహిస్తూ.

అన్నా! ఈ సంఘటనలన్నీ చూస్తూ వుంటే ఎంతో చిత్రంగా వుంటుంది సుమా. పూర్వం భరత చక్రవర్తి సర్వసంగపరిత్యాగియై అడవిలో ఘోరతపస్సు చేసి గూడా, చరమదశలో పెంపుడు జింకమీద తలపు గలుగుట వల్ల జింకగా పుట్టాడట. ఇంకా వేదాంత శాస్త్రంలోనూ,భారతం భాగవతం మొదలైన పురాణాల్లోనూ ఇట్లాంటి కథలెన్నో ఉన్నవి, "ఏ జీవిగాని కర్మావశేషం అనుభవించటానికే నా దగ్గరకు వస్తుంది. కనుక వేటినీ రాకుండా నిషేధించవ" ద్దని భగవాన్ చెప్పే వున్నారు గదా! ఆ పావురాలను చూస్తే తపోభంగమైన ఏ పుణ్యాత్ములోనని అనిపించింది. కాకుంటే అనన్యదుర్లభమైన శ్రీవారి అంకపీటం ఎట్లా లభిస్తుంది. భాగవతం పంచమస్కందంలో ఒక పద్యం వుంది. ఏమంటే,

ఉ || భారతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు, నీ
     భారతవర్ష మందు హరి పల్మరు బుట్టుచు జీవకోటికిన్
     ధీరతతోడ దత్త్వ ముపదేశము సేయుచు జెల్మి సేయుచు
     న్నారయ బాంధవాకృతి గృతార్థుల జేయుచునుండు నెంతయున్.

చూడు, దాని కిది తార్కాణం గదూ? ఏమంటావు?
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ