రమణాశ్రమ లేఖలు1 తండ్రి బిడ్డకు అణకువ 21.11.45
శ్రీ రమణాశ్రమ లేఖలు 1 తండ్రి బిడ్డకు అణకువ 21.11.45
http://bhagavanraman.blogspot.com/2018/09/211145-1.html
అన్నా
భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు, ఎప్పటికప్పుడు జాబులుగా రాయమన్నావు కానీ, నాకు సాధ్యమౌతుందా! అయినా చూద్దామని ఈ రోజే మొదలు పెడుతున్నాను. భగవదనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది.
https://www.facebook.com/359807631501891/posts/523147281834591/?app=fbl
మొన్న పూర్ణిమనాడు, ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడి గిరిప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి ,సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్ఛి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తేరు. అదే సమయానికి భగవాన్ గోశాల పక్కకు పోతూ ఆ వైభవం చూచి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరునికిచ్ఛిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్ విభూతి నుదుట ధరిస్తూ 'అప్పకు పిళ్ళై అడక్కుం' (తండ్రికి బిడ్డ అణకువ ) అని మెల్లగా అన్నారు. భగవాన్. ఆ మాటలనేటప్పుడు భక్తి పారవశ్యం వల్ల శ్రీవారి కంఠం రుధ్ధమైంది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే 'పూర్ణ భక్తియే జ్ఞానం' అన్ల పెద్దల వాక్యం రూఢమౌతున్నది. భగవాన్ శివకుమారులూ, శరీర ధారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే గనుక మహాజ్ఞానియైనా ఈశ్వరునకు అణగి ఉండునని బోధిస్తున్నట్లు స్పురీస్తోంది.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము. ఏదో నీవు రాయమంటావే గానీ ఈ రమణీయ వాణిని ఏమని రాయగలను? ఎంతని వినుతింపగలను? వాక్కలే ఋక్కులై చెలగ అని ఈ మధ్య ఒక పాటలో రాసాను . గ్రహింపగల మేధా సంపన్నులుండాలి గాని, ఒక వాక్కననేల? చూపు, నడత, పడక ఉఛ్వాస, నిశ్వాసాలు సర్వం అర్థంవంతమైనవే. నాకవన్నీ సామర్థ్యం ఉన్లదా! భగవాన్ మీద భారం వేసి ఉడుతాభక్తి అన్నట్లు ఏదో తోచింది రాస్తాను.
T.me/BhagavanRaman
Comments
Post a Comment