రమణాశ్రమ లేఖలు 20 ఉడుత 3-1-1946
రమణాశ్రమ లేఖలు 20 ఉడుత 3-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/09/20-3-1-1946.html
మన ఉడుత సహోదరులకు భగవాన్ దగ్గిర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు గదా. రెండు మూడేళ్ళ క్రితం ఆ ఉడుతలలో బహు చలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపి వాడుండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ, వాడొచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరుపాటున కొంచెం ఆలస్యం చేసారు భగవాన్. శ్రీవారు స్వయంగా నోటికందిస్తే గాని తినేవాడుకాడా కొంటే. వారాలపించినందుకు కోపించి గాబోలు అందిస్తుంటే కసిక్కిన వేలు కొరికాడు. భగవాన్ చకితులై "అరె దుష్టుపిల్లవాడా,వేలు కొరికావే, ఇక నేను పెట్టను పో" అని మందలించి తమ చేతితో ఇవ్వటం మానేశారు కొన్నాళ్ళు.
https://www.facebook.com/359807631501891/posts/509512913198028/?app=fbl
వాడూరుకుంటాడా? కాళ్ళావెళ్ళాబడి ప్రార్ధించటం మొదలు పెట్టాడు. పప్పు కిటికీలో పోసీ, సోఫా మీద పెట్టీ, తినమన్నారు భగవాన్. ఉహూ, ముట్టుకోలేదు. వారు చూచీ చూడనట్లుంటూ వచ్చారు. వాడు కాళ్ళ మీద పాకీ, వంటిమీద కెగిరీ, బుజాలెక్కీ, ఏమేమో చేస్తుంటే "చూడండి వీడు నా వేలు కోరికి నేపప్పులివ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడిప్పుడు" అని భగవంతులందరితో చెప్పి, 'అరె నీ వెందుకు నా వేలు కొరికావు? అందుకే నేనివ్వను. నీ కదే శిక్ష. అదుగో అక్కడుంది పప్పు, అది తిను" అని తోసివేశారు కొన్నాళ్ళు. వాడు తనపంతం విడువలేదు. రోజులు గడచినవి. భక్తపరతంత్రులు గనుక భగవానులే చివరకు వోడిపోయారు. నా కనిపించిందప్పుడు రాజస భక్తులిట్లాగే సిద్ధి పొందుతారు కాబోలునని.
వాడంతటితో ఆగక సాటివారిని జత చేసుకొని సోఫాకు సరిగా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడుతలన్నీ తాళ్ళూ, టెంకాయినారా తెచ్చి దూలంలో దోపటం, గాలి కవి అందరిమీదా రాలటం, మనవాళ్ళు కోపించి కట్టనీయక తరమటం జరుగుతూ వుంటే, గూడు కట్టే వసతి లేక పోయెనే అనీ, వెళ్ళు తరుముతున్నారే అనీ భగవాన్ ఎంతో తపించేవారు.ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది. ఆ దృశ్యం చూచే అప్పుడొక పద్యం వ్రాశాను.
చ. ఉడుతలు గూడు కట్టుకొన నొక్కెడసుంతయు చోటుగానమిన్
బడెడు నవస్థలం గనుచు భావమునందున దాపచిహ్నముల్
బొడమగ ద్వన్ముఖంబునను బొంపెసలారు దయార్ద్రభావమా
గదలి జనించు శీతకరు కాంతిసమూహ మటంచు దోచెడిన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
ఇది అప్పటి పద్యం. ఈ ఉడుతల వుత్తరం వ్రాశానని ఇవాళ చెపితే భగవాన్ చూచి మందహాసంతో "ఈ ఉడుతల కథ ఇంకా ఉన్నది. మొదట ఈ పైదూలందగ్గిర వాటికి పెద్ద గూడుండేది. పిల్లల్లు, పిల్లలకు పిల్లలుగా వాటి సంసారం పెద్దదయింది. సోఫా మీద వాటి యిష్టం వచ్చినట్లు చర్లాటలాడేవి. ఒకసారి నేను బయటకి వెళ్ళి వచ్చేసరికి వెనుక దిండుకింద కొన్ని పిల్లలు దాగి ఉండటం, నేను రాగానే జేర్లా బడితే అవి అట్లాగే సమాధి కావటం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బల్లలతో మూసివేశాడు. ఇంకా వాటి గాథ ఎంతో వుంది వ్రాస్తేను" అన్నారు భగవాన్
T.Me/BhagavanRaman
శివ
ReplyDelete