రమణాశ్రమ లేఖలు 18 చిరుతలు,పాములు 1-1-1946
రమణాశ్రమ లేఖలు 18 చిరుతలు,పాములు 1-1-1946
http://bhagavanraman.blogspot.com/2018/09/18-1-1-1946.html
శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుని వల్ల మొన్ననే విని వ్రాస్తున్నాను. భగవాన్ విరూపాక్ష గుహలో వుండగా సమీపంలో వున్న ఊటలో నీరు త్రాగేటందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రు శబ్ధంతో వచ్చిందట. భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పళ్ళాలు, డబ్బాలు తీసుకొని డప్పులు వేయసాగేటంతలో అది నీళ్ళు త్రాగి ఒకసారి గోండ్రుమని అరచి వెళ్ళిపోయిందట.
https://www.facebook.com/359807631501891/posts/510852569730729/?app=fbl
భగవాన్ సంభ్రమించే ఈ భక్తుల్ని చూచి "మీ రెందు కిట్లా శ్రమపడతారు. ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియజేసింది. నీళ్ళు త్రాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తనదారిన తాను పోయింది. మీ జోలికి రాలేదు గదా? మీకెందుకీ భయం? ఈ కొండ వారి నివాసం. వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏం న్యాయం? ఊరుకోండి, ఇక చాలును అట్టహాసం" అని వారించి, వారి భయం పోగొట్టనో ఏమో" ఈ గిరియందనేక సిద్ధపురుషులు నివసిస్తూ వుంటారు. వారు నన్ను చూడాలని ఏమేమో రూపాలతో వస్తూ వుంటారు. వారికి ఏవిధమైన అలజడి కలుగనీయరాదు సుమా?" అని మందలించారట. అది మొదలా పులి అప్పుడప్పుడు నీరు త్రాగే నిమిత్తం వచ్చేదట. అది పెట్టే గోండ్రు శబ్దం విని భగవాన్ "అదుగో వస్తున్నానని చెపుతున్నది. ఇదుగో పోతున్నానంటున్నది" అనేవారట. ఈవిధంగా వారికి చిరుతల కలిమి ఎంతో వున్నది.
ఆ గిరి జీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమిని గురించి, ఒక పాము వంటి మీద పాకిందనీ, కాలు ఎక్కిందనీ, ఎన్నెన్ని విధాలుగానో చెపుతూ వుంటే ఈ మధ్య ఒక భక్తుడు దీన్ని గురించి సత్యమేనని భగవానులనడిగాడు. శ్రీవారు చెప్పిన మాటలే వ్రాస్తున్నాను. "ఆ పాము స్నేహ భావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదకు పాకబోయింది. నేనే కాలు ఇవతలకు తీసుకున్నాను. అంతే, దానంతటది వస్తూ వుండేది పోతూ వుండేది" అన్నారు.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
ఈ మధ్య సన్నిధిలో నేనిది చదివినప్పుడు భగవానుని చూచి "సిద్ధ పురుషులు ఏమో రూపాలతో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా?" అన్నాను. "ఔ"నన్నారు భగవాన్. "అరుణగిరి యోగి ముంగిసగా వచ్చాడన్న మాటో?" అన్నారొకరు. "అదీ నిజమే" నన్నారు భగవాన్. "సక్తుప్రస్థుని కథలోనూ అంతే గదా?" అన్నాను. "ఔనౌ"నంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్
T.me/BhagavanRaman
Comments
Post a Comment