రమణాశ్రమ లేఖలు 17 ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది?  31-12-45

రమణాశ్రమ లేఖలు 17 ఏమీ తెలియదనేది ఎట్లా తెలిసింది?  31-12-45
http://bhagavanraman.blogspot.com/2018/09/17_21.html
      గత నెల మొదటి వారంలో ఒకనాటి ఉదయాన కేవలం అమాయకుడగు పాంథుడొకడు ఆశ్రమానికి వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఆ తరువాత 'సత్రా భోజనం, మఠా నిద్ర' అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్ళున్నాడు. వెళ్ళబోయే ముందొకనాడు భగవానుని సమీపించి జంకుతూ "స్వామి! ఇక్కడ కూర్చున్న వీరంతా భగవానుని ఏదో అడగటం తామేదో సెలవిస్తూ ఉండటం సదా జరుగుతున్నది. అది చూస్తే నాకూ ఆశ కలుగుతున్నది. కాని ఏం అడిగేందుకూ ఏమీ తెలియదే. ఇక తరించేదెట్లాగు?” అన్నాడు దీనంగా. భగవాన్ సాదరంగా చూచి “మీకు ఏమీ తెలియదనేది ఎల్లా తెలిసింది? అన్నారు నవ్వుతూ.
https://www.facebook.com/359807631501891/posts/511525256330127/?app=fbl
     "ఇక్కడికి వచ్చిన తరువాత వీరంతా అడిగే ప్రశ్నలు భగవానులు సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటూ ఉంటే అయ్యో మనకు ఏమీ తెలియదే, అన్న జిజ్ఞాస కలిగింది స్వామీ" అన్నాడతడు. "ఆ! ఇంకేమీ? మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా. అదే చాలునే. ఇంకేం కావాలి? "అన్నారు భగవాన్. " అంత మాత్రాన తరించేదెలా స్వామి?!"  అన్నాడా పృచ్ఛకుడు. "ఎలాగేమి? ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా. ఆ తెలుసుకునే వాడెవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలియదే ఎలారా తరించటం, అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదండీ! " అన్నారు భగవాన్.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
   అతడంతటితో సంతోషించి చక్కా పోయాడు. ఆ భగవద్వాణీ యొక్క సారాంశం ఆ పృఛ్ఛకునకు అర్ధం అయినా కాకున్నా ,మాదృశులకు మంత్రాక్షరములై హృదయ గుహలో మారు మ్రోగినవి సుమా. భర్తృహరి సుభాషితంలో ... 'తెలివి యొకింత లేనయెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్, దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి; యిప్పు డు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియనివాడనై మెలగితిన్ గతమయ్యె నితాంత గర్వమున్' అన్న పద్యం మననానికి వచ్చింది.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ