రమణాశ్రమ లేఖలు 16 (30-12-1945)

రమణాశ్రమ లేఖలు 16 మొదటి భిక్ష 30-12-1945 
http://bhagavanraman.blogspot.com/2018/08/30-12-1945.html
    మొన్న నొకనాటి మధ్యాహ్నం ఇష్టాగోష్టిలో భగవాన్ తాము ఈ వూరు వచ్చిన మొదటి రోజులలోని సమాచారం జ్ఞప్తికి వచ్చి ఇట్లా సెలవిచ్చారు. "గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి వుండేవారు. నేను వేగాళ్ళ మండపంలో తిరుగుతూ వుంటే మరొకరితో కలసి వారు నావద్దకు వచ్చారు. ఆయన మౌనస్వామి. నేనూ మౌనస్వామినే గదా? ఒకరితో ఒకరు మాటలేదు మంచీలేదు. మధ్యాహ్నమైంది. పాపము ఆయనే నన్ను చూచి 'ఈ కుర్రవాడు ఎవరో చాలా డస్సినట్లున్నాడు. కొంచెం ఆహారం తెచ్చి యివ్వండ'ని ఆ వచ్చిన వారితో చెప్పారు సంజ్ఞతో. వారు బ్రాహ్మణేతరులనీ, మళయాళీ అనీ, పేరు రామస్వామి అనీ, ఆ అన్నం భిక్షాన్నమేననీ వెనుక తెలిసింది. వారిప్పటికీ వస్తూనే వుంటారు.సరే. వీరు చెప్పగానే వారొక తగరుగొట్టంతో తెచ్చారు ఉప్పుడు బియ్యపుటన్నం. పెద్దపెద్ద మెతుకులు. పైన ఉప్పు, అడుగున పుల్లనీళ్ళు, నంచుకునేందుకు ఊరగాయ బద్ద. అదే శ్రీ అరుణాచలేశ్వరుని మొదటిభిక్ష. నిజంగా ఆ సుఖం ఇప్పటి భోజనంలో రవంత గూడా కనుపడదు. పంచభక్ష్య పరమాన్నాలు దానికి సాటిరావు" అన్నారు భగవాన్. "ఈ మొదటి భిక్ష భగవాన్ ఈవూరు వచ్చిన మొదటి రోజేనా?" అని నేను అడిగితే, "కాదు కాదు,మర్నాడు. అదే మనకు ఈశ్వరుడిచ్చిన మొదటి భిక్ష. ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్ళు తాగాను" అని సెలవిచ్చారు భగవాన్.
https://www.facebook.com/359807631501891/posts/512809062868413/?app=fbl
    "భగవాన్ వూళ్ళో భిక్షకు వెళ్ళటానికి మొదట ఆరంభించిన గాధ ఒకటి ఉన్నది గాబోలే?" అన్నారొక భక్తులు. "అవును, భక్తురాలు ఒకామె వుండేదామే. ఒక రోజున సాధువులందరికి పులిహోర దద్యోదనాదులతో విందు ఏర్పాటు చేసి నన్ను గూడా పంక్తికి రమ్మని బలవంతపరచింది. 'నేను భిక్షకు వెడతాను రా'నని సంజ్ఞతోనే చెప్పాను. పంక్తికన్నా వెళ్ళాలి. భిక్షకన్నా పోవాలి. సరే ఈశ్వరాజ్ఞ అని భిక్షకు బయలుదేరాను. భిక్షకు వెడతానో, వస్తుంటానో అని యమ్మకు సందేహం. నా వెనుకనే ఒక మనిషిని పంపింది. ఇక తప్పించుకోలేక కోవెలకు ఎడమ ప్రక్కనున్న వీధిలో ఒక ఇంటి ముందు నిలిచి, చెయ్యి తట్టాను. ఆ ఇంటి తల్లి చూచి, లోగడ నా సమాచారం విని వుండటం వల్ల గుర్తించి 'రా నాయనా,రా' అని సుష్టుగా భిక్ష పెట్టి, 'నాయనా! నా కొడుకొకడు పోయాడు. నిన్ను చూస్తే నా బిడ్డలాగే వున్నావు. రోజు ఇట్లాగే రా నాయనా' అని చెప్పింది. ఆమె పేరు ముత్తమ్మని తరువాత తెలిసిం" దన్నారు భగవాన్.
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ