రమణాశ్రమ లేఖలు 8 ఆత్మస్వరూపుని సేవ ఆత్మసేవ 28-11-1945 )

రమణాశ్రమ లేఖలు ఆత్మస్వరూపుని సేవ ఆత్మసేవ 28-11-1945
http://bhagavanraman.blogspot.com/2018/08/28-11-1945.html
      గత సెప్టెంబర్ - అక్టోబర్ ఆ ప్రాంతాలలో భగవానులకు కాళ్ళ నొప్పులధికంగా వుండటం వల్ల తైలం రుద్ది కాళ్ళు ఒత్తేవారు సేవకులు. మిగతా చొరవ గల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళు ఒత్తడం సమయాతిక్రమణకారంభించారు. 
https://www.facebook.com/359807631501891/posts/518168568999129/?app=fbl
       సేవకులు సహితం "రండీ, పొండీ" అనే తప్ప "రా,పో" అని పిలుచుటకే ఒప్పని భగవానులిందుకు సహించగలరా? ఖండించి వలదనుట వారి పని కాదు. అందువల్ల ఛలోక్తిగా "మీరంతా కాస్త ఆగండి. నేనున్నూ కాసేపు మీకాళ్ళు వత్తుతాను. నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దూ?" అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు వత్తుకోవటం ప్రారంభించారు. నాకు చాలా విచిత్రంగా ఉండటమే గాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారి పాదాలంటి నమస్కరిద్దామన్న కోరిక వుంటే దీంతో పూర్తిగా నశించి పోయింది. శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటవి. ఆ పుణ్యం కొంచెం వారికీ కావాలట! రవంత సూక్ష్మతగల వారికీ ఇంతకంటే హెచ్చరిక ఏం గావాలి.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
     ఆ రోజుల్లోనే ఇక్కడే నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జి, పండిన వృద్ధు, ప్రతాపరాయ దేసాయీ అనేవారు భగవానుని సమీపించి "స్వామీ, నాకు కూడా గురుపాదసేవలో భాగమివ్వా" లన్నారు. "ఓహో! సరిసరి. 'ఆత్మవైగురు:' అన్నారు. ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే. డెబ్భైయేళ్ళు దాటినవి. మీరా నాకు సేవ జేసేది. చాలు చాలు. ఇకనైనా ఆత్మసేవ చేసుకోండి. పల్కకుండా వూరికే వుంటే అంతే చాలు" అన్నారు భగవాన్. సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది? పల్కకుండా వూరికే వుంటే చాలట. అట్లా వుండటం భగవానునికే సహజంగాని మనకు సాధ్యమా? ఎంత తపించినా ఆ స్థితి రాలేదే. శ్రీవారి కరుణ మీద ఆధారపడటం కంటే చేయగలదేమున్నది?  ==> సూరి నాగమ్మ
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ