రమణాశ్రమ లేఖలు 14 మర్యాద - బంధాలు 12-12-1945

రమణాశ్రమ లేఖలు 14 మర్యాద - బంధాలు 12-12-1945
http://bhagavanraman.blogspot.com/2018/08/12-12-1945.html
    ఈ మధ్య ఒక రోజు ఉదయం ఏదో అలవాట్లను బట్టి ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావటం, ఆమె నివాసం మొదలైన సంగతులు చెపుతూ ఇట్లా అన్నారు నాతో. "అమ్మ తరచు వస్తూ వుండటం, వస్తే కొన్నాళ్ళు నిలవగా వుండటం సాగించిన వెనుక సహజంగా నేను పశుపక్ష్యాదులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను గదూ, అదే విధంగా ఆమెను కూడా మీరు మీరని పిలవబోతే ఏదో ఘాతుకం చేసినట్లు తోచింది నాకు. అంతటితో ఆ మర్యాదవాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను. సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరవుబెట్టినట్లుంటుంది. అయినా ఈ శరీరంతో ఏమున్నది?" అని డగ్గుత్తికతో వారనేసరికి ఆనందాశ్రువులతో నా కళ్ళు నిండినవి.
https://www.facebook.com/359807631501891/posts/513521202797199/?app=fbl
   నూనూగు మీసాల నూత్న యౌవనమునందడుగిడిక ముందే, ఇహాపేక్ష వదలి పరాపేక్షతో పావనమైన అరుణాచలమునకు పరుగెత్తి వచ్చి పరమనిర్వాణ సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడైన పుత్రునిదరిసి 'అమ్మా,అమ్మా' అని పిలిపించుకొన్నదా తల్లి. ఎంత భాగ్యమో. "మాతృదేవోభవ" అని వేదాలలో మొదటనే చెప్పారు పూజనీయంగా తల్లిని. చిత్రమేమంటే, ఆమెను మర్యాదగా పిలవటం అసహజంగా తోచిందట వారికి. నిజంగా వారు, "రండీ,పాండీ" అని పిలిస్తే, ఆమెకు ప్రాణం పోయినట్లుండదూ? "అమ్మా, ఏమే" అంటే సంతృప్తిగా వుంటుంది. ఈ చిన్న మాటకోసం ఆమెనెందుకు కష్టపెట్టటం అని గాబోలు భగవానుల ఉద్దేశం.
https://chat.whatsapp.com/ChpRnHo8IWJAiY31fQgdN5
     "అమ్మ పోయిన వెనుక బంధం వదిలింది గదా, ఇక స్వేచ్చగా తిరుగుతూ ఒక స్థలమని లేకుండా కొండ గుహలలో ఎక్కడైనా ఒంటరిగా ఉండి పోదామనుకుంటే అంతకంటే పెద్ద బంధమైనదిప్పుడు. కదలటానికే వీలులేదు" అని భగవాన్ ఎన్ని సార్లో అంటూ వుంటారు. వారిని గన్నతల్లి వక్కతేగాని, వారి సంతానం వేల సంఖ్యకు మించిందాయే.మరి ఈబంధం పెద్దదిగాదూ? మొన్నచూడూ, స్కందాశ్రమం మరమ్మత్తు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివర గాబోలు, ఒక మధ్యాహ్నం భోజనమయిన వెనుక యధాప్రకారం బయటకు వెళ్ళి ఆ వెళ్ళటం వెళ్ళటం ఇట్టే చూచివత్తామని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగసామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెడితే, శివమెత్తినట్లు అంతా వెళ్ళి వారిని చుట్టుకున్నాం కదలనీయకుండా, ఈ గుంపునంతా వేసుకొని ఎట్లాగో రాత్రి ఎనిమిదింటికి ఆశ్రమం చేరుకోవటం గగనమైంది.

     మరి పదిహేను రోజులకల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్ళే దోవంతా రోడ్డువలె బాగుచేసి పనివాళ్ళు భగావానులను వచ్చి చూడమని ప్రార్ధిస్తే "చూస్తాంలే" అన్నారు భగవాన్. మేమంతా వెడదాం,వెడదాం అని ఉబలాటపడితే విందు ఏర్పాటు అయిన వెనుక అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం అయిదు గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బైటకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్ళారు. ఈ సంగతి తెలిసి స్త్రీలేమి, పురుషులేమి చీకటిని లెక్కచేయకుండా టార్చీలు, లాంతర్లు, కర్రలు తీసుకొని కొండకెక్కారు. శ్రీవారి బుజ్జగింపు నెరగనివారు సరే, ఎరిగిన నేనున్నూ వెళ్ళకూడదని నిశ్చయించుకొని కొండ మొదటి మలుపువరకు రెండుసార్లెక్కి దిగి కూడా, అంతా వెడుతున్నారనే చాపల్యంతో వారందరికీ వెనుక నేనూ వెళ్ళాను. కోతిని ఎంత బుజ్జగించినా సహజచేష్టలు విడువనట్లు ఎంత అణచినా ఈ మనస్సు సహజ గుణం విడువలా. తరువాత ఎంత చింతించినా ప్రయోజనమేముంది?

      నిజంగా ఆ చీకట్లోబడి ఈ బిడ్డలంతా వస్తే కూచోటానికికైనా వ్యవధి లేకపోయిందనీ, తినటానికిన్నీ ఏమీ లేదనీ,శ్రీవారి కెంతో కష్టంగా ఉంది. అందుకే కరుణామయులు గనుక, తరువాత విందుభోజనం ఏర్పాటు చేసారు. ఎంతశక్తి సంపన్నులు గాకుంటే ఇంత సంసారం ఈదగలరు? ఎంత శాంతి సమ్రుద్దులు గాకుంటే ఇంత సంసారంలో ఉండిన్నీ దేన్నీ అంటక బంధరహితులై ఉండగలరు? మహాత్ములన్నింటికీ సమర్దులే సుమా
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ