రమణాశ్రమ లేఖలు 12 వచ్చిన దోవనే పొండి 1-12-1945

రమణాశ్రమ లేఖలు 12 వచ్చిన దోవనే పొండి 1-12-1945
http://bhagavanraman.blogspot.com/2018/08/1-12-1945.html
   మరొకప్పుడు ఒక ఆంధ్ర యువకుడు వచ్చి "స్వామీ! నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఆ మోక్షము పొందటానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంధాలు ఏమేమో చదివాను. వాటన్నిటిలో అనేక విధాలుగా వ్రాసారు. ఇంకా పెద్దలెందరినో దర్శించి వారినడిగితే అంతా తలావొక త్రోవ చెప్పారు. ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను. ఏ త్రోవన పోమ్మంటారో చెప్పండి" అన్నారు.
https://www.facebook.com/359807631501891/posts/514861905996462/?app=fbl
     భగవాన్ మందహాసం చేస్తూ "సరి సరి. మంచిది. వచ్చిన త్రోవనే పొండి" అన్నాడు. అందరికీ నవ్వు వచ్చింది. పాపమాయువకుడు నిరుత్తరుడై వారితో "అయ్యా, నేను ఎంతో ఆశ పెట్టుకొని ధనవ్యయానికి లక్ష్యపెట్టక మోక్షాపేక్షతో అంతదూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారే, ఇదెక్కడి న్యాయం, ఇదేమి, పరిహాసమా?" అని కటకట పడ్డాడు.

   అప్పుడు ఒకరందుకొని "అయ్యా, పరిహాసం కాదు, సరైన సమాధానమే చెప్పారు. 'నే నెవరు?' అను విచారణే మోక్షానికి సులభమార్గమని శ్రీవారి సిద్ధాంతం. 'నేను',(చేరడానికి) ఏ త్రోవన పోయేదీ, అని మీరడిగారు గనుక ఆ 'నేను' అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవనేపోతే మోక్షం పొందుతావని వారి మాటలకు అర్థం. ఒకవేళ పరిహాసంగా చెప్పినా మహాత్ముల వాణి యధార్థాన్నే స్పురింపజేస్తుందని  చెప్పి, 'నే నెవడ?' నను పుస్తకం తెచ్చి యిస్తే ఆ యువకుడు తెల్లబోయి, అదే ఉపదేశంగా గ్రహించి భగవానులకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు.
https://chat.whatsapp.com/4reG0oCONQn8mv7tsg6fiD
   ఇట్లా పరిహాసంగా గానీ, చలోక్తిగా గానీ, ఓదార్పుగా గానీ భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే వుంటారు. శాంతమ్మ గారు పాకశాలలో పనికి ప్రారంభించిన కొత్తలో ఒకనాడు శ్రీవారినుద్దేశించి "నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని తోస్తుంది, పనిచేసేదెట్లా?" అని అన్నదట. భగవాన్ చలోక్తిగా "మనస్సు ఉన్నచోటనే వుంచి శరీరం పనిచేయనీ" అన్నారట. నేనిక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య మధ్య ఇంటిమీద ధ్యాసతో బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూచి శ్రీవారిని సమీపించి - "పోవాలంటే మళ్ళీ ఆ గొడవల్లో పడిపోతానేమోనన్న భయం కలుగుతున్నదే" అంటే, "అంతా వచ్చి మనలోనే పడుతుంటే మన మెక్కడికి పోయి పడేదీ?" అనీ, "ఈ బంధాలింకా వదలలేదే" అంటే, "వచ్చేది రానీ, పోయేది పోనీ, నీకేమి?" అనీ అనేవారు భగవాన్. ఆ "నేను" అనేది ఏదో సరిగా చూడగలిగితే మనకు ఈ బాధలు వుంటవా?
T.me/BhagavanRaman

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ